బిగ్ బాస్ సీజన్ 4 ఈ నెలాఖరు నుంచి మొదలు కానుంది. ఇప్పటికే ఈ సీజన్లో ఎవరు పాల్గొంటారనేది ఖరారైపోయింది. కానీ కంటెస్టెంట్స్ ఎవరనే సస్పెన్స్ బాగా మెయింటైన్ చేస్తోంది స్టార్ మా నెట్వర్క్. ఇదిలా వుంటే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ తో పాటు ఈ షోకి పని చేసే క్రూ అందరినీ పద్నాలుగు రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉంచుతున్నారు. కరోనా పాజిటివ్ ఉన్నా, లేకున్నా ఇదైతే కంపల్సరీ అట.
హోమ్ క్వారంటైన్ అంటే ఆ 14 రోజుల పాటు వాళ్లందరికీ వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరికీ దూరంగా ఉండాల్సిందే. తర్వాత మరోసారి కరోనా టెస్ట్ తీసుకుని అటునుంచి అటే బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు. ఈ షోపై స్టార్ మా చాలా ఆశలు పెట్టుకుంది.
కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ నిలిచిపోయి, తీవ్ర నష్టాలు చవిచూసిన స్టార్ మా ఈసారి బిగ్ బాస్ కి మాములుగా కంటే ఎక్కువ వ్యూయర్షిప్ ఉంటుందని ఆశిస్తోంది. అందుకే తక్కువ రోజులకు ఎక్కువ ఖర్చవుతున్నా కానీ ఈ సీజన్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
This post was last modified on August 5, 2020 12:48 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…