ఏజెంట్ ఫలితం చూశాక అక్కినేని అభిమానులు తీవ్ర అసహనంతో ఉన్నారు. డిజాస్టర్లు అందరికీ సహజమే కానీ మరీ ఈ రేంజ్ లో దెబ్బ కొట్టడం మాత్రం ఊహించనిది. నిన్న ఆదివారం చాలా కేంద్రాల్లో జీరో షేర్ నమోదయ్యిందనే వార్త ఇంకా కలవరం రేపుతోంది. గత ఏడాది థాంక్ యు సైతం ఫస్ట్ సండే ఇలాంటి ఫిగర్సే నమోదు చేసింది. దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు నేరుగా నాగార్జునని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. కొడుకుల కెరీర్ మీద దృష్టి పెట్టాలని మంచి కథలు కాంబినేషన్లు వచ్చేలా చొరవ తీసుకోవాలని లేదంటే తాము తట్టుకోలేమని ట్వీట్లు వీడియోలు పెడుతున్నారు
ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అఖిల్ ఇండస్ట్రీకి వచ్చిన ఏడేళ్లలో కేవలం అయిదు సినిమాలే చేయడం తండ్రి ప్రమేయం వల్ల అనలేం. ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్పడం కంటే స్వంతంగా తీసుకునే నిర్ణయాలే ఎక్కువగా ఉంటాయి. అయినా సరే గైడ్ చేయడం అవసరమే కానీ స్వయంగా నాగే కథల జడ్జ్ మెంట్ లో గత కొన్నేళ్లుగా లెక్క తప్పుతూనే ఉన్నారు. ఆఫీసర్, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ ల కన్నా ఉదాహరణ అక్కర్లేదు. విభిన్నంగా అనిపించే ప్రయోగాలు మంచిదే కానీ అవి మరీ మోతాదు మించితే ఇలాగే జరుగుతుంది.
మరోవైపు చైతు తనకు నప్పే స్క్రిప్ట్ లే ఎంచుకుంటున్నాడు కానీ హిట్ల పరంగా కెరీర్ లో కంటిన్యూటీ లేకుండా పోతోంది. గత కొన్నేళ్లలో మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు మాత్రమే చెప్పుకోదగ్గ సక్సెస్ లు. థాంక్ యు, లాల్ సింగ్ చద్దా వగైరా అన్నీ పోయాయి. నాగార్జున ఇవన్నీ గమనించడం లేదని కాదు. చూడటం లేదని కాదు. ప్రతిదీ తానే స్పూన్ ఫీడింగ్ చేస్తూ పోతే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచన కావొచ్చు. ఏఎన్ఆర్ సైతం నాగ్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రెండు మూడేళ్ళ వరకు సలహాలిచ్చారు కానీ శివతో సహా అన్నీ నాగార్జున స్వంత డెసిషన్లే. తన పిల్లలు కూడా అదే రూట్ లో వెళ్లాలని కోరుకుంటున్నారేమో.
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…