వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో భోళా శంకర్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తయ్యిందని యూనిట్ టాక్. ఆగస్ట్ 11 విడుదలకు ఇంకో నాలుగు నెలలు టైం ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. ఇవాళ మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా వివిధ భంగిమల్లో ఉన్న చిరు స్టిల్స్ ని పోస్టర్ల రూపంలో వదిలారు. టాక్సీ బయట రిలాక్స్ గా టీ తాగుతూ ఇచ్చిన భంగిమలు ఫ్యాన్స్ కి నచ్చేలాగే ఉన్నాయి. మొత్తం మూడు లుక్స్ ఒకే గెటప్, బ్యాక్ డ్రాప్ లో ఇచ్చారు.
ఇదంతా బాగానే ఉంది కానీ అసలే ఇది వేదాళం రీమేక్. అందులోనూ మెహర్ రమేష్ దర్శకుడు. ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్ కి దీని మీద ఒకటే అనుమానాలు. డిజాస్టర్ల దెబ్బకు పదేళ్లకు పైగా దూరంగా ఉన్న ఇతను ఎలా డీల్ చేస్తాడనే భయం లేకపోలేదు. క్యాస్టింగ్ అంతా బాగానే ఉంది కానీ ఈ సంశయమే బజ్ ని పెంచలేకపోయిన మాట వాస్తవం. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న భోళా శంకర్ లో సిస్టర్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. చెల్లిగా నటిస్తున్న కీర్తి సురేష్ కు జోడిగా సుశాంత్ ని ఆల్రెడీ తీసుకున్నారు. తమన్నా మెయిన్ హీరోయిన్
ఒక ఐటెం సాంగ్ కోసం శ్రేయను సంప్రదిస్తే రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో వెనక్కు తగ్గినట్టు ఇన్ సైడ్ టాక్. ఆగస్ట్ రిలీజ్ వాయిదా పడొచ్చనే ప్రచారం కూడా జరిగింది కానీ ఫైనల్ గా మరోసారి అదే డేట్ ని కన్ఫర్మ్ చేస్తూ స్పష్టం చేశారు. మణిశర్మ వారసుడు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద సందీప్ వంగా అనిమల్, గదర్ 2 లతో పోటీ పడాల్సి ఉంటుంది. సిద్దు డీజే టిల్లు స్క్వేర్ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. శివకార్తికేయన్ కూడా రేస్ లో ఉన్నాడు. చూడాలి మరి మెగాస్టార్ ఎలాంటి ఫలితం అందుకోబోతున్నాడో
This post was last modified on May 1, 2023 11:38 am
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు…
వృత్తి నిపుణులు, దేశంలో నైపుణ్య కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడిన తర్వాత నైపుణ్య కేంద్రాలకు…
పవన్ కళ్యాణ్ వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఇంకా ఇండస్ట్రీకి రాకముందే హాట్ టాపిక్…
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల.. రాజ్యసభకు వెళ్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2024…
టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న స్పిరిట్ మీద పుకార్ల ప్రహసనం మాములుగా…