ఏజెంట్ ఫలితం చూశాక నిఖిల్ టీమ్ లో కొత్త టెన్షన్ మొదలయ్యింది. స్పై కూడా ఇదే బ్యాక్ డ్రాప్ కావడంతో పరస్పరం రెండింట్లో ఉన్న పోలికలను సీరియస్ గా విశ్లేషించుకుంటున్నారట. గ్యారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ అసలు పూర్తయ్యిందో లేదో ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేదు. 18 పేజెస్ తర్వాత నిఖిల్ బయట కనిపించడం తగ్గించేశాడు. కార్తికేయ 2 సక్సెస్ నిలబెట్టుకునే ఉద్దేశంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్న ఈ కుర్ర హీరో ఏ చిన్న పొరపాటు చేయకుండా కెరీర్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు
ఇలాంటి కీలకమైన సమయంలో స్పైకు హైప్ రావడం చాలా కీలకం. ఏజెంట్ ని ప్రేక్షకులు తిరస్కరించిన తీరు మరీ అన్యాయంగా ఉంది. కనీసం ఆదివారం సగం ఫుల్స్ కూడా పెట్టలేనంత దారుణంగా డిజాస్టర్ కావడం ఊహించనిది. అన్ని హంగులు, సురేందర్ రెడ్డి లాంటి సీనియర్ దర్శకుడు ఉన్నప్పటికీ ఇలా జరగడం వెనుక పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఇప్పుడు అఖిల్ కన్నా ఎక్కువగా నిఖిల్ కే ఉంది. ఎనభై కోట్ల బడ్జెట్ బూడిదలో పోసినట్టు జరగడం కళ్ళముందే కనిపిస్తుంటే అదే జానర్ ని టచ్ చేస్తున్న హీరో ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే.
ఇంతకీ ఈ స్పై ఏ స్టేజిలో ఉందో వీలైనంత త్వరగా జనానికి చెప్పడం అవసరం. ఈ తరహా హై బడ్జెట్ మూవీస్ కి షూటింగ్ స్టేజి నుంచే ప్రమోషన్ అయ్యేలా ఏదో ఒకటి చెబుతూ వార్తల్లో నలిగేలా చేయాలి. కానీ స్పై విషయంలో అలా జరగడం లేదు. దీన్ని కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారు. ఏజెంట్ ముందు అన్ని భాషల్లో అనుకున్నారు కానీ తీరా పనుల ఒత్తిడి వల్ల తెలుగు మలయాళంకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మిగిలిన లాంగ్వేజెస్ అవసరం లేకుండా పోయాయి. ఇవన్నీ స్పై పాఠాలుగా తీసుకుని ప్లాన్ చేసుకోవాల్సిందే
This post was last modified on April 30, 2023 9:46 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…