బాలీవుడ్ బాద్షాగా పిలుచుకునే షారుఖ్ ఖాన్ వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. తండ్రి పోలికను దాదాపు పుణికిపుచ్చుకున్న ఈ కుర్రాడికి సరైన కథలు దర్శకులు పడితే త్వరగానే పెద్ద స్థాయికి వెళ్లే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. షారుఖ్ ఆ మేరకు రంగం సిద్ధం చేశారు. అయితే సినిమా నుంచి కాకుండా కాస్త విభిన్నంగా వెబ్ సిరీస్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై స్టార్ డం అనే టైటిల్ తో ఆరు ఎపిసోడ్ల సిరీస్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
సినీ రంగాన్నే నేపధ్యంగా తీసుకుని రూపొందుతున్న స్టార్ డం విశేషమేమంటే ఆర్యన్ ఖాన్ కేవలం నటించడమే కాదు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. గత డిసెంబర్ లోనే సోషల్ మీడియా వేదికగా తన తెరంగేట్రాన్ని సూచిస్తూ ఆర్యన్ ఒక ఫోటోని షేర్ చేశాడు. కానీ వివరాలేమీ పెట్టలేదు. అప్పటికే స్టార్ డం షూటింగ్ మొదలైపోయింది. కానీ మీడియాకు తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తూ వచ్చిన షారుఖ్ త్వరలోనే ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి చెప్పబోతున్నారు. ఈలోగా లీకుల రూపంలో ఈ సంగతి బయటికి రావడంతో క్షణాల్లో వైరల్ అయిపోయింది
స్టార్ కిడ్స్ ఇండస్ట్రీకి రావడం కొత్తేమి కాదు కానీ ఇలా స్వంతంగా డైరెక్ట్ చేస్తూ ప్రవేశించడం మాత్రం బహుశా మొదటిసారని చెప్పొచ్చు. ఖాన్ల ద్వయంలో సల్మాన్ కి అసలు పెళ్లి లేదు. అమీర్ ఖాన్ కు పిల్లలను పరిచయం చేసే విషయంలో ఏ ఆలోచన ఉందో గుట్టుగా ఉంది. టాప్ లీగ్ లో ఉన్న ఈ ముగ్గురి తర్వాత ఏర్పడే గ్యాప్ ని వాడుకునేందుకు ఆర్యన్ కు ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. సైఫ్ అలీ ఖాన్, అనిల్ కపూర్, శత్రుఘ్నసిన్హా లాంటి వాళ్ళు కూతుళ్లను మాత్రమే తెరకు తీసుకొచ్చారు. షారుఖ్ వీళ్ళ కన్నా చాలా పెద్ద రేంజ్. అంత స్థాయిని కొడుకు అందుకుంటాడా లెట్ సీ
This post was last modified on April 30, 2023 9:45 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…