Movie News

అఖిల్.. కింకర్తవ్యం?

అక్కినేని అభిమానుల బాధ ఇప్పుడు మామూలుగా లేదు. దశాబ్దాలుగా అక్కినేని ఫ్యానిజాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్లకు ఇప్పుడు ఆ హీరోల ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఇటు నాగార్జున.. అటు నాగచైతన్య, అఖిల్.. ఎవరూ కూడా సరైన ఫాంలో లేరు. ఫ్లాపులు ఎవ్వరికైనా సహజమే కానీ.. రోజు రోజుకూ అక్కినేని హీరోల క్రేజ్, మార్కెట్ పడిపోతుండటమే ఆందోళన కలిగిస్తోంది.

కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో చైతూ ‘థాంక్యూ’, నాగ్ ‘ది ఘోస్ట్’, అఖిల్ ‘ఏజెంట్’తో దారుణమైన డిజాస్టర్లను ఎదుర్కొన్నారు. నాగ్, చైతూల కంటే కూడా అఖిల్ భవిష్యత్ అగమ్య గోచరంగా కనిపిస్తోంది. ‘ఏజెంట్’తో అతడి దశ తిరిగిపోతుందని.. పెద్ద మాస్ హీరో అయిపోతాడని అభిమానులు అనుకుంటే.. అసలు తర్వాత ఎలాంటి సినిమాలో తెలియని అయోమయంలో పడిపోయాడు అతను. అఖిల్‌తో పాటు నాగ్‌ను ఈ ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా వేధిస్తోంది.

తొలి సినిమా ‘అఖిల్’తో మాస్ యాక్షన్ ట్రై చేశారు. అది వర్కవుట్ కాలేదు. ‘హలో’లో స్టైలిష్ యాక్షన్, లవ్ మిక్స్ చేసి సినిమా చేశారు. అదీ ఆడలేదు. ‘మిస్టర్ మజ్ను’తో పూర్తి స్థాయి లవ్ స్టోరీ ప్రయత్నించారు.. అదీ తేడా కొట్టేసింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అన్నింట్లోకి బెటర్ ప్రాడక్టే. కానీ ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ అఖిల్‌కు ఏమాత్రం రాలేదు. హీరోయిన్ పూజా హెగ్డే, పాటలకే మేజర్ క్రెడిట్ వెళ్లిపోయింది. ఇక లాభం లేదని ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ట్రై చేశారు. అఖిల్‌ను వైల్డ్ బీస్ట్ లాగా చూపించడానికి ప్రయత్నించారు. కానీ అది మరింత చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో ఇప్పుడు అఖిల్‌కు ఎలాంటి కథలు నప్పుతాయి.. అతను ఎలాంటి పాత్ర చేస్తే ప్రేక్షకులు మెచ్చుతారు అన్నది అంతుబట్టక అందరూ తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ‘ఏజెంట్’ మీద మంచి అంచనాలుండటంతో ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు, దర్శకులు అతడితో సినిమా చేసేందుకు ఆసక్తితోనే ఉన్నారు. కానీ ఈ సినిమా రిజల్ట్ చూశాక అందరూ భయపడుతున్నారు.

యువి క్రియేషన్స్‌లో ‘సాహో’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఒక డెబ్యూ డైరెక్టర్‌తో అఖిల్ సినిమా ఉంటుందని ‘ఏజెంట్’ విడుదలకు ముందు ప్రచారం జరిగింది. కానీ ‘ఏజెంట్’ రిజల్ట్ తర్వాత నిజంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందా అన్న సందేహాలు తలెత్తున్నాయి. కథల విషయంలో కూడా ముందున్న ఆలోచన మారిపోయే ఛాన్సుంది. మరి అఖిల్ కోసం నాగ్ ఎలాంటి ప్లానింగ్‌లో ఉన్నాడో.. అతడి కెరీర్‌ను ఎలా సరిదిద్దుతాడో చూడాలి

This post was last modified on April 30, 2023 8:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

4 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

4 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

5 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

5 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago