‘స్వామి రారా’ సినిమాతో టాలీవుడ్లో అందరూ తన వైపు చూసేలా చేశాడు యువ దర్శకుడు సుధీర్ వర్మ. చంద్రశేఖర్ యేలేటి ‘అనుకోకుండా ఒక రోజు’ తర్వాత టాలీవుడ్లో థ్రిల్లర్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ లాగా నిలిచింది ‘స్వామి రారా’. క్వింటన్ టొరంటినో, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుల ప్రభావం తన మీద ఉన్న విషయం చెబుతూ వాళ్ల సినిమాల నుంచి స్ఫూర్తి పొందడమే కాక.. కాపీ కొట్టడానికి కూడా వెనుకాడనని ఆ సినిమా టైటిల్స్‌లో అతను పేర్కొనడం కూడా ఒక సంచలనమే.
తొలి సినిమా తర్వాత అతడి మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ సినిమా వచ్చి పదేళ్లు గడిచిపోగా.. ఇప్పటిదాకా మళ్లీ దానికి దరిదాపుల్లో నిలిచే సినిమా ఏదీ తీయలేకపోయాడు సుధీర్. కేశవ, రణరంగం లాంటి సినిమాలు చూసినపుడు.. టేకింగ్ పరంగా సూపర్, సరైన కథను ఎంచుకోకపోవడమే సుధీర్ సమస్య అనుకున్నారు. కానీ ఇటీవలే రిలీజైన ‘రావణాసుర’ చూశాక సుధీర్ టేకింగ్ సహా అన్ని విషయాల్లో పట్టు కోల్పోయాడని స్పష్టం అవుతోంది.
‘రావణాసుర’ చిత్రాన్ని థియేటర్లలో చూసిన వాళ్లు అప్పట్లోనే సుధీర్ వర్మ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్దగా జనాల దృష్టిలో పడకుండానే ఆ సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కాగా.. మరోసారి ఇదెంత పేలవమైన సినిమా అనే విషయంలో చర్చ జరుగుతోంది. నెటిజన్లు అందరూ సుధీర్ వర్మ మీద విరుచుకుపడుతున్నారు. ‘స్వామి రారా’తో ఇంటలిజెంట్ డైరెక్టర్ అని, హాలీవుడ్ ప్రమాణాలతో థ్రిల్లర్లు తీయగల సమర్థుడని కితాబులు అందుకున్న దర్శకుడు.. మినిమం లాజిక్ లేకుండా ‘మాస్క్’ కాన్సెప్ట్‌ను డీల్ చేసిన విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత సిల్లీగా సినిమా ఎలా తీశావ్ అంటూ సుధీర్‌ను నిలదీస్తున్నారు.
ఒకప్పుడు అతణ్ని అభిమానించిన వాళ్లే ఇప్పుడు తనపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి కథను సొంత బేనర్లో ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధ పడ్డ రవితేజను కూడా తప్పుబడుతున్నప్పటికీ.. ప్రధానంగా అందరూ టార్గెట్ చేస్తున్నది సుధీర్‌నే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసే దర్శకులు ఇలాంటి తప్పులు చేస్తే పట్టించుకోరు కానీ.. ‘స్వామి రారా’ లాంటి డిఫరెంట్ థ్రిల్లర్ తీసిన డైరెక్టర్ ఇంత ఇల్లాజికల్‌గా సినిమా తీసేసరికి కోపం తన్నుకొస్తున్నట్లుంది.
This post was last modified on April 30, 2023 2:22 pm
``ప్రధాని నరేంద్ర మోడీని వాడుకోవడం అంటే.. చంద్రబాబు తర్వాతే.. అనేలా వ్యవహరించారు`` అనేకామెంట్లు వినిపిస్తున్నాయి. చెలిమి చేయడం.. చేతులు దులుపుకోవడం…
కొందరు దర్శకులకు తాము తీసింది ఫ్లాపని ఒప్పుకోవాలంటే మహా కష్టంగా అనిపిస్తుంది. ఏదో ఒక సాకు చెప్పి తాము తీసింది…
ఐపీఎల్ 2025 సీజన్లో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం…
బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ విషయంలో ఏదైనా కొంత అసంతృప్తి కలిగించిన…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో దినదినాభివృద్ది సాధిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని…
గత ఏడాది డిసెంబర్లో ఆల్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప 2 తెలుగులో కంటే హిందీలోనే భారీ వసూళ్లు…