సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ.. దీనికి మొదట్నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ప్రతిసారీ ఏదో ఒక నెగెటివ్ ఈ చిత్రం విషయంతోనే వార్తల్లో నిలుస్తోంది. ముందు ఒక కథ అనుకుని, షూటింగ్ మొదలుపెట్టి.. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి కొత్త కథ మీద త్రివిక్రమ్ వర్క్ చేయడం.. రకరకాల కారణాల వల్ల దీని షూటింగ్ మొదలుపెట్టడంలో ఆలస్యం జరగడం తెలిసిందే. చివరికి కొన్ని నెలల కిందట షూట్ మొదలైనా.. ఒకట్రెండు షెడ్యూళ్ల తర్వాత మళ్లీ బ్రేక్ పడింది.
తీసిన సన్నివేశాల విషయంలో సంతృప్తి చెందలేదని.. దీంతో షూట్ ఆపి మహేష్ ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. ఔట్ పుట్ విషయంలో అసంతృప్తి అన్నది ఎంత వరకు నిజమో కానీ.. మహేష్ అయితే ఇటీవలే ఫారిన్ ట్రిప్ వెళ్లడం మాత్రం వాస్తవం. ఇలా వరుసగా నెగెటివ్ న్యూస్‌లు వస్తుండటంతో మహేష్ అభిమానుల్లో కలవరం మొదలైంది.
ఎక్కడ ఈ సినిమాను మధ్యలో ఆపేస్తారో అన్న చర్చ కూడా నడుస్తోంది మహేష్ అభిమానుల్లో. ఇలాంటి టైంలో మహేష్ ఫ్యాన్స్ కొంచెం ఎగ్జైట్ అయ్యేలా ఒక పాజిటివ్ న్యూస్ చెప్పాడు సీనియర్ నటుడు జగపతిబాబు. మహేష్ సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర అదిరిపోతుందంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
“త్రివిక్రమ్ నా కోసం అద్భుతమైన పాత్రలు సృష్టిస్తాడు. నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్రలే రాస్తాడు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’లో నా కోసం పవర్ ఫుల్ క్యారెక్టర్ సృష్టించాడు. ఆ పాత్రకు నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. జనాలు కూడా ఇష్టపడ్డారు. ఇప్పుడు దాని కంటే కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నాం. మహేష్ సినిమాలో నా క్యారెక్టర్ బసిరెడ్డి పాత్ర కంటే చాలా వైల్డ్‌గా, భయంకరంగా ఉంటుంది. ప్రేక్షకులు కచ్చితంగా దాన్ని ఇష్టపడతారు” అని జగపతిబాబు తెలిపాడు. విలన్ పాత్ర బాగుంటే.. హీరో పాత్ర కూడా ఎలివేట్ అవుతుంది. సినిమాకు అది బాగా కలిసొస్తుంది. కాబట్టి జగపతిబాబు తన పాత్ర గురించి ఇలా చెప్పడం మహేష్ అభిమానులకు ఊరటనిచ్చేదే.
This post was last modified on April 30, 2023 2:10 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…