సినీ రంగంలో సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ కాబట్టి.. ఇక్కడ విజయానికి ఇచ్చే విలువే ఉంటుంది. ఒక నటుడు కావచ్చు.. టెక్నీషియన్ కావచ్చు.. మరొకరి విషయంలో కావచ్చు.. ముందు రోజు వరకు అస్సలు పట్టించుకోని వాళ్లు.. ఆ వ్యక్తి సక్సెస్ సాధించగానే వచ్చి చుట్టూ మూగుతారు. శుక్రవారం సినిమా ఫలితాన్ని బట్టి సాయంత్రానికి ఆ సినిమాలో ఉన్న వాళ్ల జాతకాలు మారిపోతుంటాయి. సినిమా సక్సెస్ అయితే కాల్స్, మెసేజెస్‌తో ఫోన్ హోరెత్తిపోతుంటుంది. ఇలా రాత్రికి రాత్రి జీవితాలు మారిపోయిన వాళ్లు చాలామందే కనిపిస్తారు ఫిలిం ఇండస్ట్రీలో.
మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ విషయానికి వస్తే పది రోజుల ముందు వరకు అతడి పరిస్థితి వేరు. తన చివరి సినిమా ‘రిపబ్లిక్’ పెద్ద డిజాస్టర్ అయింది. అంతకుముందు చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ కూడా సరిగా ఆడలేదు. దీనికి తోడు రోడ్డు ప్రమాదం వల్ల తీవ్రంగా గాయపడి.. మనిషి బాగా డల్ అయిపోయాడు. ప్రమాదం నుంచి కోలుకుని బయటికి వచ్చి సినిమా చేసినా.. మునుపటి ఉత్సాహం లేదతడిలో. అతడి వోకల్ కార్డ్స్ కొంచెం దెబ్బ తిని మాట కూడా సరిగా మాట్లాడలేని పరిస్థితి తలెత్తింది. ‘విరూపాక్ష’ సినిమా షూట్లో అతను చాలా ఇబ్బంది పడ్డట్లు ఇండస్ట్రీలో చర్చ జరిగింది. దీనికి తోడు ‘విరూపాక్ష’కు విడుదల ముంగిట ఆశించిన బజ్ కనిపించలేదు.
ఒకప్పుడు తేజు సినిమాలకు తొలి రోజు మార్నింగ్ షోలకు ఈజీగా ఫుల్స్ పడిపోయేవి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. దీంతో మొత్తంగా తేజు చుట్టూ ఒక రకమైన నెగెటివిటీ కనిపించింది విరూపాక్ష రిలీజవుతున్న టైంలో. కానీ ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. తొలి రోజు సాయంత్రం నుంచి హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్లడం.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లడంతో మొత్తం కథ మారిపోయింది. తేజు పట్ల అందరిలోనూ సానుకూల అభిప్రాయం వచ్చింది. ఇండస్ట్రీలో ఆటోమేటిగ్గా అతడి క్రేజ్ మునుపటి స్థాయికి చేరుకుంది.
ఇప్పుడు తేజు డేట్ల కోసం నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. తనకు కథలు చెప్పడానికి దర్శకులు పోటీ పడుతున్నారు. ఐతే తేజు తొందరపడకుండా, ఇంతకుముందులా తప్పులు చేయకుండా.. ఆచితూచి సినిమాలు ఎంచుకోవడం మంచిదని శ్రేయోభిలాషులు, అభిమానులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి అతను సంపత్ నంది సినిమాతో పాటు జయంత్ పానుగంటి అనే యువ దర్శకుడితో సినిమాలు కమిటైనట్లు తెలుస్తోంది. ఇక తేజు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలయికలో వినోదియ సిత్తం రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం జులై నెలాఖర్లో విడుదల కాబోతోంది.
This post was last modified on April 30, 2023 2:13 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…