ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ నీరుగార్చడంతో అక్కినేని ఫ్యాన్స్ ఇప్పుడు కస్టడీ వైపు చూస్తున్నారు. మే 12న విడుదల కాబోతున్న ఈ కాప్ డ్రామా తాలూకు ప్రమోషన్లు ఇంకా ఊపందుకోలేదు. తమ్ముడి సినిమానే కాబట్టి ఏజెంట్ హడావిడి అయ్యాక స్టార్ట్ చేద్దామని చైతు సూచించడంతో టీమ్ ఆగిపోయింది. కానీ ఒక్క రోజుకే సీన్ మారిపోయింది. కలెక్షన్లు మరీ తీసికట్టుగా పడిపోవడంతో ఇంకెలాంటి హోప్స్ లేవని బయ్యర్లు వీకెండ్ మీదే ఆధారపడ్డారు. దీనికన్నా విరూపాక్ష, పొన్నియిన్ సెల్వన్ 2 వసూళ్లు మెరుగ్గా ఉండటం గాయం మీద కారం చల్లినట్టు అవుతోంది.
కస్టడీ ప్రీ టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తున్న అంశాలు లేకపోలేదు. దీనికి దర్శకుడు వెంకట్ ప్రభు. మొదటిసారి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ చేశారు. గత ఏడాది తమిళంలో మానాడుతో హిట్టు కొట్టారు కానీ గ్యాంబ్లర్ తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేదు. హీరోయిన్ కృతి శెట్టికి వరస డిజాస్టర్లలో ఉంది. శ్రీలీల హవా పెరిగాక ఈ ఉప్పెన భామని దాదాపు అందరూ మర్చిపోయారు. సంగీతం అందించిన ఇళయరాజా తెలుగులో యావరేజ్ ఆల్బమ్ ఇచ్చి ఏళ్ళు గడిచాయి. ఈయనతో పాటు కలిసి చేస్తున్న యువన్ శంకర్ రాజా మీదే ఏ నమ్మకం పెట్టుకున్నా
సో ఇలా పలుకోణాల్లో కస్టడీ మీద ప్రెజర్ ఉన్న మాట వాస్తవం. చైతుకి బాగా వర్కౌట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్ టైనర్, లవ్ స్టోరీ లాంటివి కాకుండా కంప్లీట్ గా సీరియస్ జానర్ లో చేస్తున్న సినిమా ఇది. ఇలా ఎన్నో క్యాలికులేషన్లు ముందస్తుగా కొంత టెన్షన్ కలిగిస్తున్న మాట వాస్తవం. అక్కినేని ఫ్యామిలీలో థాంక్ యు, ది ఘోస్ట్, ఏజెంట్ రూపంలో హ్యాట్రిక్ డిజాస్టర్లు పడ్డాయి. సో దీన్ని కస్టడీ బ్రేక్ చేయాలి. మే నెల మొత్తంలో బడ్జెట్, స్టార్ ఇమేజ్ కోణంలో చూసుకుంటే కస్టడీ ఒక్కటే పెద్ద రేంజ్ లో కనిపిస్తోంది. ఇది అంచనాలకు మించి ఉంటే తప్ప ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యేలా లేరు
This post was last modified on April 30, 2023 9:21 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…