తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రావడం, వేదికపై స్వర్గీయ నందమూరి తారకరామారావు, బాలయ్య, చంద్రబాబునాయుడు గార్ల మీద ప్రశంసల వర్షం కురిపించడం రాజకీయ రంగు పులుముకుంది.
సాధారణంగా ఇలాంటి ఈవెంట్లకు వెళ్ళినప్పుడు సదరు వ్యక్తుల గొప్పదనం గురించి వివరించడం గెస్టుల కనీస బాధ్యత. అందులోనూ రజినికి అన్నగారితో ప్రత్యక్ష అనుబంధం ఉంది. టైగర్ లాంటి సినిమాల్లో కలిసి నటించిన జ్ఞాపకాలున్నాయి. అలాంటప్పుడు ఆయన సహజంగానే తనదైన శైలిలో వాటిని పంచుకున్నారు.
ఇప్పుడీ ప్రసంగమే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కొడాలి నాని రజనీకాంత్ ని తీవ్రంగా విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పక్క రాష్ట్రంలోనే కాక దేశవిదేశాల్లో కోట్లాది అభిమానులున్న అంత పెద్ద స్టార్ హీరోని స్థాయికి తగని కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఇది స్వంత పార్టీ వాళ్ళే హర్షించలేకపోతున్నారు. ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన పరిణామాలను తవ్వి తీసి మోకాలికి బోడి గుండుకి ముడిపెట్టినట్టు ఇప్పటి పరిస్థితులకు వాటిని అన్వయించి రజనిని తిట్టిపోయడాన్ని ఎవరూ ఏ కోశానా సమర్ధించలేరు.
ఈ వ్యవహారమంతా ఆగస్ట్ లేదా దీపావళిలో విడుదల కాబోయే జైలర్ మీద ప్రభావం చూపిస్తుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తరహాలో జైలర్ కు ఇబ్బందులు సృష్టించే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. అయితే వాస్తవిక కోణంలో చూస్తే అలాంటి భయమేమీ అక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమాకు తెలుగులో పాతిక ముప్పై కోట్ల బిజినెస్ ఏమీ జరగదు. మహా అయితే పది పదిహేను మధ్యలోనే క్లోజ్ చేస్తారు. పైగా టికెట్ రేట్ల పెంపు లాంటి ప్రత్యేక వెసులుబాట్లు అవసరం పడదు. అలాంటప్పుడు కేవలం తలైవాని టార్గెట్ చేసుకుని జైలర్ ని ఏదో చేయడం జరగని పని
This post was last modified on April 29, 2023 5:54 pm
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…