‘లైగర్’ డిజాస్టర్ రిజల్ట్ అందుకోవడంతో పూరి జగన్నాథ్ పని ఇక అయిపోయిందనే నిర్ణయానికి అందరూ వచ్చేశారు. ఆయనకు గతంలోనూ డిజాస్టర్లు ఎన్నో వచ్చాయి. కానీ ఆ ప్రభావం పెద్దగా తనపై పడనివ్వకుండా.. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తర్వాతి సినిమాను మొదలుపెట్టేసేవాడు. ఒకప్పట్లా స్టార్ హీరోలు, నిర్మాతలు ఆయన కోసం లైన్లో ఉండేవారు కానీ.. హీరోలు, నిర్మాతలు దొరకని పరిస్థితి మాత్రం ఎప్పుడూ లేదు. కానీ ‘లైగర్’ తర్వాత మాత్రం దాదాపుగా అలాంటి పరిస్థితే కనిపించింది.
‘లైగర్’ నష్టాల తాలూకు గొడవలు కొనసాగడంతో కొత్త సినిమా మీద దృష్టి పెట్టలేని పరిస్థితి కూడా పూరి ఎదుర్కొన్నాడు. కానీ ఎలాగోలా ఆ అడ్డంకిని అధిగమించాడు. మళ్లీ కథల మీద కూర్చున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడన్న కృతజ్ఞతతో రామ్.. పూరితో సినిమా చేయడానికి ముందుకొచ్చినట్లు కూడా వార్తలొచ్చాయి.
ఈ సినిమా గురించి అతి త్వరలో అధికారిక ప్రకటన వస్తుందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు పూరి కొత్త చిత్రం గురించి ఆశ్చర్యకర వార్త బయటికి వచ్చింది. అందరూ అనుకుంటున్నట్లుగా పూరి తన తర్వాతి సినిమాను రామ్‌తో చేయట్లేదట. నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నాడట. రామ్ సినిమా క్యాన్సిల్ అయినట్లు కాదు కానీ.. దాని కంటే ముందు బాలయ్యతో సినిమా ఓకే చేయించుకున్నట్లు హాట్ న్యూస్ ఒకటి హల్‌చల్ చేస్తోంది.
ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుండటం విశేషం. ఇంతకుముందు పూరి-బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’ డిజాస్టరే అయినప్పటికీ.. అందులో తనను పూరి ప్రెజెంట్ చేసిన విధానం బాలయ్యకు నచ్చింది. పూరితో ఇంకో సినిమా చేస్తానని అప్పట్లోనే బాలయ్య చెప్పాడు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటూ పూరి చెప్పిన ఒక టిపికల్ కథకు బాలయ్య ఓకే చెప్పాడట. ఇది ఫుల్ మాస్ ఎంటర్టైనర్ లాగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వస్తుందట.
This post was last modified on April 29, 2023 5:51 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…