జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో పాటు ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ తన ఫేవరెట్ హీరోను డైరెక్ట్ చేస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
హీరోయిన్ జాన్వి కపూర్, విలన్ సైఫ్ అలీ ఖాన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. ఇలా ఈ సినిమాతో ఎటాచ్ అయిన ప్రతి పేరూ ఎగ్జైట్ చేస్తున్నదే.
బాగా టైం తీసుకుని స్క్రిప్టు పూర్తి చేసి, భారీగా ప్రి ప్రొడక్షన్ చేసుకుని రంగంలోకి దిగాడు కొరటాల శివ. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కొన్ని వారాల కిందటే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. ఈ సినిమా కోసం తారక్ సరికొత్త లుక్‌లోకి మారడం కూడా అభిమానులను ఎగ్జైట్ చేసింది.
ఇక ఎన్టీఆర్ 30 టీం తొలి షెడ్యూల్లోనే సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన ఎపిసోడ్లను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అందులో ఒక భారీ యాక్షన్ ఘట్టం కూడా ఉందట. అది కుస్తీ పోటీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ ఫైట్ ఇండస్ట్రీలో ఆల్రెడీ హాట్ టాపిక్ అయిపోయింది. ఎన్టీఆర్‌ను కుస్తీ యోధుడిగా చూపించడం అంటే ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇవ్వబోతున్నట్లే. తెలుగులో ఇలాంటి ఫైట్ ఏ స్టార్ హీరో చేయలేదనే చెప్పాలి. ఇందుకోసం ఎన్టీఆర్ తన శరీరాకృతిని కూడా మార్చుకునే ఉంటాడు. సినిమాలో ఒక కీలక సందర్భంలో ఈ ఫైట్ వస్తుందట.
భారీ ఎత్తున జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఈ ఫైట్ చిత్రీకరించారని.. సినిమాలో మేజర్ హైలైట్లో ఒకటిగా ఈ ఘట్టం ఉంటుందని అంటున్నారు. తారక్ పూర్తిగా ఈ సినిమాకే అంకితం అయి ఉండటంతో విరామం లేకుండా సినిమా షూటింగ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. వచ్చే ఏడాది మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 29, 2023 5:53 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…