Movie News

ఏజెంట్ రిజల్ట్.. వేళ్లన్నీ అతడి వైపే

కొత్త సినిమా వచ్చాక ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో.. దాని వసూళ్లు ఏ స్థాయిలో ఉండబోతోందో.. దాని ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసుకోవడానికి కనీసం వీకెండ్ అయ్యే వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. కొన్ని సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టడం కూడా చూడొచ్చు.

కానీ ‘ఏజెంట్’ సినిమా రిజల్ట్ ఏంటో చూడ్డానికి వారాంతం వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదని.. మార్నింగ్ షోలతోనే తెలిసిపోయింది. కొంచెం రేంజ్ ఉన్న సినిమాల్లో ఇలా త్వరగా టాక్ ఏంటో తేలిపోవడం కొన్నిటికే జరుగుతుంది. గత ఏడాది వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా ‘లైగర్’ విషయంలో ఏమైందో.. ఇప్పుడు ‘ఏజెంట్’ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా ఎవ్వరికీ రుచించే అవకాశం లేదని.. డిజాస్టర్ పక్కా అని ఒక్క షోకే తేలిపోయింది. దీన్ని బట్టే సినిమా ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమా ఫలితం విషయంలో ఇప్పుడు వేళ్లన్నీ దర్శకుడు సురేందర్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే హీరో అఖిల్‌ను నిందించడానికి ఏమీ కనిపించడం లేదు. సురేందర్ రెడ్డి ఏం చెబితే అది అతను చేశాడు. సూరి కోరుకున్నదానికంటే ఎక్కువ కష్టపడి కళ్లు చెదిరేలా బాడీ పెంచాడు. సినిమా కోసం ఇంత కష్టపడేవాళ్లు అరుదుగా ఉంటారు. పెర్ఫామెన్స్ పరంగా అఖిల్‌కు యావరేజ్ మార్కులే పడతాయి కానీ.. అతను కెరీర్ ఆరంభంలోనే ఉన్నాడు కాబట్టి ఆ విషయంలోనూ వేలెత్తి చూపించలేం.

అఖిల్ ఎలా చేశాడు అన్నదాని కంటే తన పాత్ర ఎలా ఉంది.. సినిమా ఎలా ఉంది అన్నది ముఖ్యం. అఖిల్ సంగతి పక్కన పెడితే.. అనిల్ సుంకర లాంటి నిర్మాత దొరకడం సురేందర్ అదృష్టం. హీరో ఇమేజ్, మార్కెట్ గురించి ఆలోచించకుండా కళ్లు మూసుకుని పదుల కోట్లు పోసేశాడు. సినిమాకు రూ.80 కోట్లు ఖర్చయినట్లు రిలీజ్ ముంగిట చెబితే ఏమో అనుకున్నాం కానీ.. తెర మీద చూస్తే భారీ ఖర్చు కనిపించింది. 50-60 కోట్లకు ఏమాత్రం తక్కువ అయ్యే అవకాశమే లేదు. ఇలా కష్టపడే హీరో, కళ్లు మూసుకుని ఖర్చు పెట్టే నిర్మాత దొరికాక సురేందర్ స్క్రిప్టు విషయంలో, మేకింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది.

వాళ్లిద్దరూ అంత రిస్క్ చేసి మొత్తం సురేందర్‌కు వదిలేసి.. అతను ఏం చెబితే అది చేశారు. కానీ సూరి వారి నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. కథ మీద పెద్ద కసరత్తే జరిగినట్లు లేదు. ఏం తోచితే అది రాసేశారు. తీసేశారు. మరీ ఇల్లాజికల్‌గా పాత్రలు, సినిమాను నడిపించారు. అందుకే మార్నింగ్ షోలకే సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. గతంలో సూరికి కిక్-2, ఊసరవెల్లి, అశోక్ లాంటి డిజాస్టర్లు ఉన్నా అవి తీసిపడేయదగ్గ సినిమాలు కాదు. ఎక్కడో కొంచెం తేడా కొట్టి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ‘ఏజెంట్’ మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అనడంలో సందేహం లేదు. ఇది సూరి కెరీర్‌ మీద తీవ్ర ప్రతికూల ప్రభావమే చూపేలా ఉంది.

This post was last modified on April 29, 2023 9:11 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago