కొన్ని సినిమాలు ఓ దర్శకుడి చేతికి వెళ్ళి మళ్ళీ మరో దర్శకుడి దగ్గరికి వెళ్ళడం చాలా సందర్భాలలో జరిగినవే. అయితే పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ వెనుక కూడా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ సినిమాను ముందుగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయాలని అనుకున్నారు దిల్ రాజు. వేణు శ్రీరామ్ చేతిలో ఈ ప్రాజెక్ట్ పెట్టక ముందే కొందరు దర్శకులను అనుకున్నారు. అందులో ప్రధముడు హరీష్. తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకున్నాడు.
నీరు కొండ పార్వై సినిమా ట్రైలర్ హరీష్ శంకర్ నాకు పంపించి ఒకసారి చూడండి పవన్ గారికి ఈ సినిమా తెలుగులో బాగుంటుంది అని చెప్పాడు. తర్వాత నేను ఆ సినిమా చూడటం జరిగింది. తర్వాత హరీష్ శంకర్ మరో సినిమాతో బిజీ గా ఉండటం వల్ల ఐకాన్ ఆలస్యం అవుతుండటంతో వేణు శ్రీరామ్ చేతిలో పెట్టమని తెలిపాడు. ఇక పవన్ తో సినిమా చేస్తావా ? అని ఆడగగానే వేణు శ్రీరామ్ చేసిన వర్క్ నచ్చి వెంటనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లానని దిల్ రాజు తెలిపారు.
ఇక ఒక టైమ్ లో పవన్ గారిని కలిసేందుకు వీలు అవ్వకపోవడంతో త్రివిక్రమ్ గారి ద్వారా అప్రోచ్ అయ్యమని రాజు అన్నారు. అజిత్ గారి సినిమాను పవన్ గారితో చేయాలని అనుకుంటున్నాం అనగానే త్రివిక్రమ్ మీరు కాన్ఫిడెంట్ ఆ ? అని అడిగి వెంటనే పవన్ గారికి సినిమా చూపించే ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా చేశారని అన్నారు. సో అలా పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ సినిమా ఫైనల్ గా హరీష్ దగ్గర నుండి వేణు శ్రీరామ్ చేతిలో పడింది.
This post was last modified on April 29, 2023 9:11 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…