మంచి అంచనాలున్న ఒక సినిమా రిలీజవుతుంటే.. పోటీలో ఉన్న మిగతా సినిమాలు కొంచెం కంగారు పడతాయి. దానికి మంచి టాక్ వస్తే.. తమ పని అయిపోతుందని ఆ చిత్రాల మేకర్స్ భావిస్తారు. అదే సమయంలో ఆ పేరున్న సినిమాకు టాక్ తేడా కొడితే వీరికి కలిసి వస్తుంది. ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఏజెంట్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురయ్యేసరికి బాక్సాఫీస్ బరిలో ఉన్న మిగతా చిత్రాలకు బాగానే కలిసొచ్చేలా ఉంది. దీంతో పాటుగా శుక్రవారం అనువాద చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ రిలీజైంది. తెలుగులో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్ రాజు కావడంతో రిలీజ్ పెద్దగానే చేశారు.
‘పొన్నియన్ సెల్వన్-1’ తెలుగులో సరిగా ఆడకపోయినా దిల్ రాజు తగ్గలేదు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే రెండో భాగానికి బెటర్ టాక్ వచ్చింది. ‘ఏజెంట్’ వీకెండ్లోనే చాలా కష్టంగా అడుగులు వేసేలా కనిపిస్తుండటం ‘పొన్నియన్ సెల్వన్-2’కు బాగా కలిసొచ్చే విషయమే. దీనికి కచ్చితంగా వసూళ్లు మెరుగుపడబోతున్నాయి.
ఇక ‘ఏజెంట్’ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుండటం వల్ల ‘పీఎస్-2’ కంటే కూడా ఎక్కువ లాభ పడేది ‘విరూపాక్ష’ సినిమానే. సాయిధరమ్ తేజ్ హీరోగా గత వారం విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పట్టింది. ఆ చిత్రానికి వీకెండ్ తర్వాత కూడా నిలకడగా వసూళ్లు వచ్చాయి. ఐతే రెండో వీకెండ్లో పోటీని తట్టుకుని నిలబడుతుందా అన్న సందేహాలు తలెత్తాయి కానీ.. ‘ఏజెంట్’ తొలి రోజు సాయంత్రానికే పడుకుండిపోవడం ‘విరూపాక్ష’కు బాగా ప్లస్ అయింది. శుక్రవారం కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. శని, ఆదివారాల్లో హౌస్ ఫుల్స్‌తో రన్ అయితే ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంకో వారం పాటు ఆ చిత్రానికి ఢోకా లేనట్లే.
వచ్చే వారం రిలీజయ్యే ‘రామబాణం’, ‘ఉగ్రం’ చిత్రాల ఫలితాలను బట్టి ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎంత వరకు సాగుతుందన్నది తేలుతుంది. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొచ్చి తేజు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ దిశగా అడుగులు వేస్తున్నాడు.
This post was last modified on April 29, 2023 1:31 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…