Movie News

చెల్లి సెంటిమెంటుతో కొత్త బిచ్చగాడు

అసలే అంచనాలు లేకుండా వచ్చి తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బిచ్చగాడుని మూవీ లవర్స్ అంత త్వరగా మర్చిపోలేరు. డబ్బింగ్ హక్కులను కేవలం యాభై లక్షలకు కొంటే ఇరవై కోట్లకు పైగా వసూలు కావడం అప్పట్లో మాములు సంచలనం కాదు. ఈ ఒక్క సినిమానే విజయ్ ఆంటోనీకి చాలా కాలం పాటు మార్కెట్ ని తెచ్చిపెట్టింది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఏదో ఒకటి కొట్టకపోదా అనే నమ్మకంతో బయ్యర్లు వస్తూనే ఉన్నారు. సరే ఇవేవి వర్కౌట్ కావడం లేదని బిచ్చగాడు టైటిల్ కి 2 జోడించి వస్తున్నాడు విజయ్ ఆంటోనీ. ఇందాక ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకడైన విజయ్ కురుమూర్తి(విజయ్ ఆంటోనీ) మీద ప్రత్యర్థుల కన్ను ఉంటుంది. లక్షల కోట్ల విలువైన సంపదను హస్తగతం చేసుకోవాలని కుట్రలు పన్నుతూ ఉంటారు. ఈలోగా అతని హత్య జరుగుతుంది. మర్డర్ చేసిన హంతకుడు అచ్చుగుద్దినట్టు అతని పోలికల్లోనే ఉండటం పోలీసులకు న్యాయశాఖకు సవాల్ గా మారుతుంది. అయ్యప్ప మాలలో అతి సామన్యుడిగా కనిపించే ఈ వ్యక్తికి గుండెలు పిండేసే ఫ్లాష్ బ్యాక్, అందులో ప్రాణంగా ప్రేమించిన చెల్లెలు ఉంటారు. ఇదంతా ఒకరి కథేనా లేక ఇద్దరున్నారానేది తెరమీద చూడాలి.

విజువల్స్ గట్రా గ్రాండ్ గా ఉన్నాయి. విజయ్ ఆంటోనీ ఎప్పటిలాగే తన మార్కు యాక్టింగ్ తో కంటిన్యూ అయ్యాడు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ క్రైమ్ కం సస్పెన్స్ డ్రామాలో ఎమోషన్లు గట్టిగానే దట్టించారు. తన స్వీయ దర్శకత్వంలోనే విజయ్ దీన్ని తెరకెక్కించడం విశేషం. ఓన్ ప్రొడక్షన్ కావడంతో బడ్జెట్ విషయంలో భారీతనం కనిపిస్తోంది. సంగీతం కూడా అతనే. ముందు మే 12 విడుదలనుకున్నారు కానీ పొన్నియిన్ సెల్వన్ 2కి హిట్ టాక్ రావడంతో ఇంకో వారం వాయిదా వేసి మే 19 రిలీజ్ చేయబోతున్నారు. అమ్మలాగే చెల్లి సెంటిమెంట్ ఏమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

This post was last modified on April 29, 2023 1:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగిల్ డే… జగన్ కు డబుల్ స్ట్రోక్స్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…

1 hour ago

అవకాశాలు వదిలేస్తున్న విశ్వంభర

జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…

2 hours ago

చంద్ర‌బాబు.. ఎస్టీల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌…!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజ‌న ప్రాబ‌ల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీల‌కు భారీ మేలును…

2 hours ago

మహానాడులో మార్పు లేదు..

ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…

2 hours ago

కోర్ట్ దర్శకుడు…సీతారామం హీరో !

ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…

5 hours ago

భయంకర ఉగ్రవాదికి నష్టపరిహారమా..?

ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…

6 hours ago