ప్రస్తుతం ‘ఏజెంట్’ సినిమాతో థియేటర్స్ లో ఉన్న అఖిల్ నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు. యూవీ క్రియేషన్స్ లో అఖిల్ తదుపరి సినిమా ఉండబోతుంది. ఈ సినిమాతో అనీల్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఈ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టబోతున్న అనీల్ గతంలో ప్రభాస్ కి ఓ కథ చెప్పాడని టాక్ ఉంది. సాహో , రాదేశ్యామ్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు అనీల్. సాహో టైమ్ లోనే యూవీ నిర్మాతలకు ఓ ఐడియా చెప్పి వాళ్ళ మెప్పు పొందాడు. ఆ కథను ప్రభాస్ తో చేయించాలని భావించారట నిర్మాతలు. కానీ సాహో , రాధే శ్యామ్ ఎఫెక్ట్ తో అనీల్ ను ప్రభాస్ కి జత చేయడం కరెక్ట్ కాదని భావించి అతనికి ఇప్పుడు అఖిల్ సినిమా అప్పగించారని ఇన్ సైడ్ టాక్.
ప్రభాస్ కోసం రెడీ చేసిన ఆ కథతోనే అనీల్ ఇప్పుడు అఖిల్ సినిమా చేస్తున్నాడా ? అనేది తెలియాల్సి ఉంది. అఖిల్ సరైన హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. తాజాగా వచ్చిన ‘ఏజెంట్’ భారీ డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో నెక్స్ట్ సినిమాపై అఖిల్ చాలా కేర్ తీసుకొనున్నాడు. ఈ సినిమాతో అక్కినేని హీరో కోరుకున్న సాలిడ్ హిట్ పడుతుందని యూవీ నిర్మాతలు అనీల్ మీద గట్టి నమ్మకం పెట్టుకున్నారట.
This post was last modified on May 1, 2023 4:21 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…