నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ విపరీతమైన నెగటివిటీతో సోషల్ మీడియా ట్రోలింగ్ కి టార్గెట్ గా మారిపోయింది. దర్శకుడు సురేందర్ రెడ్డి డెబ్యూ డైరెక్టర్ కన్నా అన్యాయంగా ఇలాంటి సబ్జెక్టుని ఎంచుకున్నారని ఫ్యాన్స్ ఓపెన్ గానే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంత కష్టపడి అఖిల్ బాడీ బిల్డ్ చేసుకుని మూడేళ్లు కేటాయిస్తే ఇలాంటి రిజల్ట్ దక్కడం పట్ల వాళ్ళ మనోవేదన అంతా ఇంతా కాదు. ఏదో మిస్టర్ మజ్ను లాంటి రామ్ కామ్ ఫ్లాప్ అయితే ఇంత రియాక్షన్ ఉండేది కాదు కానీ ప్యాన్ ఇండియా రేంజ్ లో బిల్డప్ ఇచ్చుకోవడ రచ్చకు కారణం అయ్యింది.
ఇదంతా గమనిస్తున్న తల్లి అమల అక్కినేని ఇన్స్ టా వేదికగా స్పందించారు. నిన్న థియేటర్ కు వెళ్లి ఏజెంట్ చూసినప్పుడు అన్ని వర్గాల కుటుంబ ప్రేక్షకులు వచ్చారని యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు వాళ్ళ అరుపులతో కొత్త ఉత్సాహం వచ్చిందని కాస్త మోటివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్రోలింగ్ ని అర్థం చేసుకున్నానని, ఇది ఎప్పుడూ లోతైన అభద్రతా భావం నుంచి పుడుతుందని, మెరుగ్గా సాధించాల్సింది గుర్తుచేస్తుందని సృజనాత్మకత గురించి ఆరు లైన్ల కొటేషన్ ను జతపరిచారు. ఖచ్చితంగా తర్వాత చేయబోయే సినిమా మెరుగ్గా గొప్పగా ఉంటుందని హామీ ఇచ్చారు
మొదటిరోజే అమల ఇంత ఓపెన్ కావడం విశేషమే. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ లేదనే కొరత ఏజెంట్ తీరుస్తుందని అఖిల్ బోలెడు నమ్మకం పెట్టుకున్నాడు. ప్రమోషన్లు విపరీతంగా చేశాడు. డే అండ్ నైట్ రెస్ట్ లేకుండా అడిగిన వాళ్లందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చి నిర్మాత ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లి పబ్లిసిటీలో భాగం అయ్యాడు. తీరా చూస్తే ఆడియన్స్ తిరస్కరించారు. డిజాస్టర్లు అందరు హీరోలకు సహజమే అయినా అఖిల్ కు ఈ టైంలో జరగకుండా ఉండాల్సింది. నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…