స్పై జానర్ సినిమా అంటే స్క్రిప్టింగ్ లోనే ఎంతో కసరత్తు చేసుకోవాలి. హీరో డేట్స్ ఉన్నాయి కదా అని , నిర్మాత దొరికాడు కదా అని సాదా సీదా కంటెంట్ తో వస్తే ప్రేక్షకులు తిప్పి కొట్టడం ఖాయం. తాజాగా అఖిల్ , సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ఏజెంట్’ ఇందుకు పెద్ద ఉదాహరణ. నిజానికి ఏజెంట్ విషయంలో అఖిల్ ని తప్పు పట్టడానికి ఏమిలేదు. కావల్సినంత కష్టపడ్డాడు. నటన పరంగా కూడా పాత్రకు తగ్గట్టే చేశాడు. లోపమంతా కథ , కథనం, డైరెక్షన్ లో ఉంది.
అసలు వక్కంతం ఇచ్చిన ఈ కథను తీసుకోవడమే సురేందర్ రెడ్డి చేసిన మొదటి తప్పు. దాన్ని ఎలాంటి కిక్ ఇవ్వని ప్లాట్ స్క్రీన్ ప్లే తో తీయడం మరో తప్పు. లాజికులు పక్కన పెట్టేసి స్పై మూవీను ఏదో కమర్షియల్ యాక్షన్ సినిమాలా తీస్తే ఎలా ? హెలీ కాప్టర్స్, ఖరీదైన కారులు, విదేశాల్లో షూటింగ్ చేస్తే సరిపోతుందా ? అసలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే కంటెంట్ ఉండన్నక్కర్లేదా ?
ఈ జానర్ లో సినిమాలు చేసిన హీరోలు చాలా అరుదు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఇప్పుడు శేష్ లాంటివాళ్లు మాత్రమే స్పై మూవీస్ చేశారు. గూడచారితో అడివి శేష్ హాలీవుడ్ స్టైల్ స్పై థ్రిల్లర్ చూపించి శెభాష్ అనిపించుకున్నాడు. కనీసం ఇలాంటి స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు అడివి శేష్ ఏం చేశాడు ? ఎలాంటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ? అని తెలుసుకోవాలి కదా. ఎక్కడో అమెరికాలో కాదు ఇక్కడే మన తెలుగు హీరో ఉండనే ఉన్నాడు. ఈ జోనర్ లో ఒక బ్లాక్ బస్టర్ కొట్టేసి దానికి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేసుకుంటూ స్క్రిప్ట్ మీదే కొన్ని నెలలు వర్క్ చేస్తున్న శేష్ నుండి ఎవరైనా నేర్చుకోవాల్సిందే మరి.
This post was last modified on April 29, 2023 8:54 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…