ఏడాదికి ఎక్కువ సినిమాలు చేసే యంగ్ హీరోల లిస్టులో నిఖిల్ ముందుంటాడు. ప్రతీ ఏడాది నిఖిల్ నుండి మూడు లేదా రెండు సినిమాలు గ్యారెంటీ. గతేడాది కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ చివర్లో 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా నిఖిల్ కి ఆశించిన విజయం అందించలేదు. 18 పేజెస్ వచ్చి ఐదు నెలలవుతుంది. ఇంత వరకూ నిఖిల్ నెక్స్ట్ సినిమా సందడి లేనేలేదు.
ఎడిటర్ గ్యారీ తో ‘స్పై’ అనే మూవీ చేస్తున్నాడు నిఖిల్. ఈ మధ్య ఓ అప్ డేట్ వదిలి మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. అలాగే సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేశాడు. అది ఐదు రోజుల మినహా ఘాట్ కంప్లీట్ అయింది. ఆ సినిమా గురించి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. మరి ఐదు నెలల్లో ఒక్క అప్ డేట్ కూడా లేకుండా నిఖిల్ ఎందుకు సైలెంట్ అయినట్టు ?
బహుశా తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ స్పై రిలీజ్ డేట్ లాక్ అవ్వకపోవడమే కారణమా ?. అన్నీ భాషల్లో ఒకే సారి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి సరైన డేట్ చూసి ఓ నెల పాటు గట్టి ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నాడు కాబోలు. ఏదేమైనా నిఖిల్ ఇప్పటి నుండే ప్రమోషన్స్ మొదలు పెడితే బెటర్ అప్పటికి సినిమాకి కొంత హైప్ వస్తుంది. లాస్ట్ మినట్ ప్రమోషన్స్ చేస్తే 18 పేజెస్ ఓపెనింగ్సే రిపీట్ అవుతాయి.
This post was last modified on April 28, 2023 8:29 pm
ఈసారి ఐపీఎల్ మొదలవుతుండగా.. అందరి కళ్లూ సన్రైజర్స్ హైదరాబాద్ మీదే నిలిచాయి. ఆ జట్టును టైటిల్కు హాట్ ఫేవరెట్గా పేర్కొన్నారు…
దేవతా భూమిగా.. అజరామరమైన దేవేంద్రుడి రాజధానిగా ప్రధాన మంత్రి అభివర్ణించిన అమరావతి రాజధాని సాకారం కావాలనేది యావత్ తెలుగు ప్రజల…
మారిపోతున్న పరిస్థితులకు అనుగుణంగా సినిమాను చూసే విధానం, థియేటర్ రన్ అయ్యాక దాన్ని ఓటిటికి ఇచ్చే పద్ధతుల్లో కానీ చాలా…
ఒక ఏ రేటెడ్ వయొలెంట్ సినిమాకు మొదటి రోజు నలభై మూడు కోట్లు రావడం చిన్న విషయం కాదు. మూడు…
హిట్ 3 ది థర్డ్ కేస్ లో అడవి శేష్ క్యామియో ఉందనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే స్టంట్…
గత ఏడాది ఎన్నికలకు ముందు వైసీపీచేసిన ప్రయోగాల గురించి అందరికీ తెలిసిందే. ఒక నియోజకవర్గం నుంచి నాయకులను మరో నియోజకవర్గానికి…