కొన్నేళ్ళుగా నానికి సరైన సాలిడ్ హిట్ లేదు. యావరేజ్ లు , అబోవ్ యావరేజ్ కంటెంట్ తో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోతున్న నాని కి దసరా ఆ లోటు తీర్చేసింది. తొలి సారి నాని మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా థియేటర్స్ లో భారీ కలెక్షన్స్ అందుకుంది. అయితే నాని నుండి ఈ మధ్య వచ్చిన సినిమాలు కొన్ని థియేటర్స్ లో మెప్పించలేకపోయినా ఓటేటీ లో మాత్రం మంచి వ్యూస్ కొల్లగొట్టాయి. వాటితో నాని హ్యాపీనే కానీ థియేటర్ మార్కెట్ పడిపోతుందే అనే భాద నేచురల్ స్టార్ లో ఉంది.
ఇక దసరా నాని మళ్ళీ థియేటర్ మార్కెట్ ను పెంచేసి మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఓవరాల్ గా 100 కోట్ల గ్రాస్ దాటేసిన దసరా తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియన్స్ ముందుకొచ్చింది. ఫ్యామిలీస్ అంతా కూర్చొని ఈ మాస్ సినిమాను బాగానే చూస్తున్నారు. నిన్నటి నుండి ఓటేటీ ప్రేక్షకులు దసరాను పదే పదే చూస్తూ మంచి వ్యూస్ అందిస్తున్నారు.
నాని కి ఫ్యామిలీస్ ఉన్న ఇమేజ్ తో మాస్ సినిమా అయినా దసరా ను ఇంటిల్లి పాది చూసేస్తున్నారు. ఏదేమైనా దసరా హీరోగా నాని గ్రాఫ్ పెంచడమే కాకుండా అటు థియేటర్స్ లో ఇటు ఓటీటీ లో రెండి విధాల సక్సెస్ సాదించి నేచురల్ స్టార్ కి ఓ మెమోరబుల్ మూవీగా మిగిలింది.
This post was last modified on April 28, 2023 8:24 pm
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…