Movie News

ఎన్టీఆర్‌తో ర‌జ‌నీకాంత్‌ సంబంధం ఏంటంటే!

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ద‌శ దిశ‌లా చాటిన అన్న‌గారు ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని గ‌త ఏడాది మే 28 నుంచి రాష్ట్రం, దేశ విదేశాల్లోనూ నిర్వ‌హిస్తున్నారు.అయితే.. ఇప్పుడు నేటి నుంచి(ఏప్రిల్ 28) వ‌చ్చే నెల అన్న‌గారి 100వ జ‌యంతి(మే 28) వ‌ర‌కు ఊరూవాడా ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని టీడీపీ నిర్ణ‌యం తీసుకుంది. దీనిలో భాగంగా విజ‌య‌వాడ శివారులో ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు.

అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. నిజానికి ఎంతో మంది ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించిన వారు ఉన్నా.. ర‌జ‌నీని పిల‌వ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం.. ఉంది. ర‌జ‌నీ ఇంట్లో నిలువెత్తు ఎన్టీఆర్ చిత్ర‌పటం ఉండ‌డ‌మే కాకుండా.. సినీరంగంలో ఇప్ప‌టికీ ఎన్టీఆర్ వేసిన దారుల్లోనే ర‌జ‌నీ న‌డుస్తున్నార‌నే విష‌యం చాలా త‌క్కువ మందికి తెలుసు.

దీంతో టీడీపీ నుంచి ఆహ్వానం అంద‌గానే.. ర‌జ‌నీ కాంత్ విజ‌య‌వాడ‌లో వాలిపోయారు. ఇక‌, ఎన్టీఆర్‌తో ర‌జ‌నీ క‌లిసి న‌టించిన సినిమాలు రెండే రెండు. ఒక‌టి టైగ‌ర్‌. ఇది పూర్తిగా తెలుగు సినిమా అయితే.. రెండో మ‌ణ్ణ‌న్ వాణి(నిండు మ‌నిషి) అనే త‌మిళ సినిమా. ఈ రెండు సినిమాల‌తోనే ఇద్ద‌రి మ‌ధ్య గాఢానుబంధం ఏర్ప‌డింది. నిర్మాత‌కు విలువ ఇవ్వ‌డం.. గౌర‌వం ఇవ్వ‌డం.. నిర్మాత‌ల‌ను వేధించ‌కుండా.. ఉండ‌డం వంటివి అన్న‌గారి నుంచి తాను నేర్చుకున్నాన‌ని.. అనేక సంద‌ర్భాల్లో ర‌జ‌నీ చెప్పారు. వాటినే ఇప్ప‌టికీ ఆయ‌న పాటిస్తున్నారు.

ఇక‌, విజ‌య‌వాడ చేరుకున్న ర‌జ‌నీకాంత్‌కు.. నంద‌మూరి బాల‌కృష్ణ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వెంట‌నే ఆయ‌న విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్ కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బాల‌య్య‌తో క‌లిసి.. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసానికి వెళ్తారు. అక్క‌డ తేనీటి విందు తీసుకున్నాక‌.. సాయంత్రం 6 గంట‌ల‌కు అంద‌రూ క‌లిసి.. విజ‌య‌వాడ లో నిర్వ‌హించే అన్న‌గారి శ‌త‌జ‌యంతి కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

This post was last modified on April 28, 2023 2:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago