హీరోగా తన తొలి సినిమా ‘అఖిల్’తో అక్కినేని కుర్రాడు అఖిల్ అప్పట్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. టాలీవుడ్లో అరంగేట్రానికి ముందు ఏ హీరోకూ రానంత క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకుని ఎనిమిదేళ్ల కిందటే ఏకంగా రూ.40 కోట్లకు పైగా బడ్జెట్లో సినిమా చేశాడు. ఐతే మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ రూపొందించిన ఈ చిత్రం కంప్లీట్ మిస్ ఫైర్ అయింది. అంచనాలను ఏమాత్రం అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది.
ఆ తర్వాత తొలి సక్సెస్ కోసం అఖిల్ పడ్డ కష్టం అంతా తెలిసిందే. హలో, మిస్టర్ మజ్ను కూడా నిరాశ పరిచాక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఏదో హిట్టు కొట్టాం అంటే కొట్టాం అనిపించాడు. ఆ సక్సెస్ ఇచ్చిన ఊపులో ‘ఏజెంట్’ లాంటి భారీ చిత్రం చేశాడు. తొలి సినిమాతో పోలిస్తే దీని బడ్జెట్ రెట్టింపు.
ఈసారి సురేందర్ రెడ్డి లాంటి మరో స్టార్ డైరెక్టర్ చేతుల్లో పడ్డాడు అఖిల్. అనిల్ సుంకర ఎంతో రిస్క్ చేసి ఎవ్వరూ ఊహించని బడ్జెట్లో ఈ సినిమా తీశాడు. ఈ రోజే ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
‘అఖిల్’లో మాదిరే ఈసారి కూడా అఖిల్‌ను పెద్ద మాస్ హీరోలా చూపించే ప్రయత్నం జరిగిందని ఈ సినిమా ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. నిజానికి టీజర్, ట్రైలర్ చూసి చాక్లెట్ బాయ్‌లా కనిపించే అఖిల్‌ను మరీ ఇంత వైల్డ్‌గా, మాస్‌గా చూపిస్తే వర్కవుట్ అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం చేశారు.
కానీ తాము అఖిల్‌లో ఒక కాబోయే సూపర్ స్టార్‌ను చూసి ఇలా చేశాం అంటున్నారు దర్శక నిర్మాతలు. మరి ప్రేక్షకులు కూడా సినిమా చూసి అలాగే ఫీలవుతారేమో చూడాలి. అఖిల్ కెరీర్‌కు మేక్ ఆర్ బ్రేక్ అయ్యే సినిమాగా అభిమానులు ‘ఏజెంట్’ను చూస్తున్నారు. ‘అఖిల్’… ఆ తర్వాత చేసిన సినిమాలతో అఖిల్‌కు ఉన్న ఫాలోయింగ్ తగ్గుతూ వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ కూడా అంతకంతకూ నిరాశలోకి వెళ్లిపోయారు.
కానీ ‘ఏజెంట్’కు వచ్చేసరికి ఫ్యాన్స్ అంతా మళ్లీ ఉత్సాహం నింపుకుని ఈ సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నంలో పడ్డారు. మరి శుక్రవారం తన కెరీర్లో మరో పెద్ద బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమవుతున్న అఖిల్ ఏమేర మెప్పిస్తాడో చూడాలి. దీంతో పాటుగా తమిళ అనువాద చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-2’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలి భాగంతో నిరాశపరిచిన మణిరత్నం ఈసారి ఏమేర తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.
This post was last modified on April 28, 2023 10:05 am
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…