సమంతను శకుంతలగా చూపిస్తూ గుణ శేఖర్ తీసిన మైథాలాజికల్ పీరియాడిక్ డ్రామా ‘శాకుంతలం’ ప్రేక్షకులను ఆకట్టుకోలేదన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గుణ శేఖర్ తో కలిసి దిల్ రాజు నిర్మించాడు. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న టైమ్ లో 3d కి కన్వర్ట్ చేసి స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా మీద గుణ శేఖర్ తో పాటు దిల్ రాజు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. సమ్మర్ లో పిల్లలతో కుటుంబాలు ఈ సినిమాకి వచ్చి కలెక్షన్స్ ఇస్తారని ఆశించారు.
కట్ చేస్తే సినిమా ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. దీంతో దిల్ రాజు కి ఈ సినిమా భరే నష్టాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఈ సినిమా రిజల్ట్ పై రియాక్ట్ అయ్యాడు దిల్ రాజు. తన పాతికేళ్ళ కెరీర్ లో శాకుంతలం సినిమా పెద్ద జర్క్ ఇచ్చిందని చెప్పుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా దిల్ రాజు ఎన్నో నష్టాలు చూశారు. కానీ శాకుంతలం పెద్ద ఎఫెక్ట్ అని చెప్పడంతో ఈ సినిమా ఆయనకి నిర్మాతగా భారీ లాస్ తెచ్చిందని అర్థం చేసుకోవచ్చు.
అనుష్క తో ‘రుద్రమదేవి’ తీసి నిర్మాతగా ఇబ్బందులు పడ్డ గుణశేఖర్ కి శాకుంతలం తో దిల్ రాజు భాగస్వామ్యం కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఫైనాన్షియల్ గా అన్నీ దిల్ రాజు నే చూసుకున్నారు. ఇక ఈ సినిమాలో దిల్ రాజు మంచి బడ్జెట్ నే పెట్టారు కూడా. ముఖ్యంగా 3d కోసం ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇక శకుంతల దుష్యంత్ ల ప్రేమ కథతో తీసిన ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు మినిమం ఆసక్తి చూపలేదు. పైగా మొదటి రోజు వచ్చిన నెగటివ్ టాక్ తో సమంత క్రేజ్ కూడా ఓపెనింగ్స్ తేలికపోయింది. ఏదేమైనా దిల్ రాజు కి గుణ శేఖర్ శాకుంతలం రూపంలో పెద్ద జలక్ తగిలింది.
This post was last modified on April 27, 2023 7:09 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…