మత సంబంధిత వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసినపుడు సెన్సార్ వాళ్లను ఒప్పించి సినిమాను బయటికి తీసుకురావడం అంత తేలిక కాదు. కొన్నిసార్లు సెన్సార్ వాళ్లు బాగా కోతలు వేస్తారు. కొన్నిసార్లు సెన్సార్ సమస్యల వల్ల అసలు సినిమాలు బయటికే రాని పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఇప్పుడు అలాంటి ఓ వివాదాస్పద సినిమా గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఆ చిత్రమే.. ది కేరళ స్టోరీ.
హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి, వాళ్లను వ్యూహాత్మకంగా ఇస్లాం మతంలోకి మార్చి.. ఉగ్రవాదులుగా మార్చి దేశానికి వ్యతిరేకంగా పని చేసేలా చేసే నేపథ్యంలో ఈ సినిమా నడవడం గమనార్హం. కేరళలో ఇలాంటి ఉదంతాలు చాలానే జరిగాయి గతంలో. కానీ ఇలాంటి సున్నితమైన విషయాలపై సినిమాలు తీయడం సాహసమే. సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్ పాల్ సింగ్ ఈ సినిమాను నిర్మించాడు.
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఆదా శర్మ ఇందులో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. కేరళలో సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన అమ్మాయి పాత్రలో ఆమె నటించింది. ఆమెతో పాటు మరికొందరు హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలు ఒక కాలేజీలో చేరతారు. అక్కడ హాస్టల్లో వారితో పాటు ఒక ముస్లిం అమ్మాయి ఉంటుంది. ఆమె ఉగ్రవాదుల ఆదేశాల మేరకు ఆమె.. వీరిని ఒక వ్యూహం ప్రకారం వాళ్ల మతాల మీద ద్వేషం పుట్టి, ఇస్లాం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తుంది. ఇస్లాం స్వీకరించాక వీరు ఉగ్రవాదులుగా మారతారు. తాము ఎంత తప్పు చేస్తున్నామో ఊహించేలోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. దేశానికి వ్యతిరేకంగా పని చేసి, ఆ తర్వాత ఉగ్రవాదుల దారుణాలకు బలయ్యే పరిస్థితి వస్తుంది. ఈ క్రమాన్ని చాలా బోల్డ్‌గా తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ సినిమా మీద ముస్లిం సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం ఖాయం. ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగొచ్చు. థియేటర్ల మీద దాడులు జరిగే అవకాశాలూ లేకపోలేదు. ఐతే మోడీ సర్కారు హయాంలో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి వివాదాస్పద చిత్రాన్ని క్లియర్ చేసిన సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి కూడా ఎలాగోలా క్లియరెన్స్ ఇస్తుందనే భావిస్తున్నారు.
This post was last modified on April 27, 2023 6:55 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…