అక్కినేని అఖిల్ కెరీర్ ఎలాంటి మలుపు తిరగబోతోందో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్లో (మేకర్స్ చెబుతున్న ప్రకారం) తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనే కాక ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్‌తో అఖిల్ జట్టు కట్టడం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.
ఐతే ‘ఏజెంట్’ టీజర్, ట్రైలర్ల విషయంలో కొంచెం మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. సుకుమారంగా కనిపించే అఖిల్‌ను అంత వైల్డ్‌గా చూపించడం సరిగ్గా లేదని.. యాక్షన్, ఎలివేషన్ల విషయంలో ఓవర్ ద టాప్ వెళ్లినట్లు అనిపిస్తోందనే కామెంట్లు వినిపించాయి. కానీ చిత్ర బృందం మాత్రం సినిమా మంచి ఫలితాన్నందుకుంటుందనే ధీమానే వ్యక్తం చేస్తూ వచ్చింది మీడియా ముందు. ఐతే ఈ సినిమాకు యుఎస్‌లో ప్రిమియర్స్ సరైన సమయానికి పడతాయా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.
‘ఏజెంట్’ షూటింగ్ పది రోజుల ముందే పూర్తయింది. అంతకుముందు నుంచే ప్రి ప్రొడక్షన్ నడుస్తుండగా.. రిలీజ్‌కు రెండు రోజుల ముందు కూడా ఆ పని నడుస్తూనే ఉంది. మామూలుగా యుఎస్‌లో ప్రిమియర్స్ సమయానికి పడాలంటే.. రెండు మూడు రోజుల ముందే కంటెంట్ చేరిపోవాలి. కానీ ‘ఏజెంట్’ విషయంలో అలా జరగలేదు. ఐతే ఈ హడావుడి విషయంలో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఏజెంట్’ టీం పట్టుదలతో పని చేసి ఉంటే.. సమయానికి కంటెంట్ యుఎస్ చేరిపోయేదని.. ప్రిమియర్స్ కొంచెం ఆలస్యంగా పడితేనే మంచిదనే ఉద్దేశంతో కంటెంట్ డిలే చేశారని అంటున్నారు.
‘ఏజెంట్’ రిజల్ట్ మీద సందేహాలేమీ లేకపోయినా.. ఇది మాస్ టచ్ ఉన్న సినిమా కావడంతో యుఎస్ ఆడియన్స్ నుంచి పూర్తి ఆమోదం పొందే అవకాశాలు తక్కువే అని.. ముందు ప్రిమియర్స్ పడితే డివైడ్ టాక్ వచ్చి తొలి రోజు ఓపెనింగ్స్ మీద, ఓవరాల్ రిజల్ట్ మీద నెగెటివ్ ఎఫెక్ట్ పడొచ్చనే సందేహాలు చిత్ర బృందంలో ఉన్నాయని అంటున్నారు. అందుకే ప్రిమియర్స్ కొంచెం ఆలస్యంగా పడేలా చూస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on April 27, 2023 6:48 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…