బయో సెక్యూర్ బబుల్.. ఈ మధ్య ఆటల్లో బాగా ప్రాచుర్యం పొందిన మాట. ముఖ్యంగా క్రికెట్లో ఇది బాగా చర్చనీయాంశం అయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెటింగ్ దేశాలూ కరోనాతో అల్లాడుతూ కనీసం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడానికి కూడా వెనుకంజ వేస్తున్న వేళ.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విజయవంతంగా ఓ టెస్టు సిరీస్ నిర్వహించిందంటే అందుక్కారణం.. ఈ బయో సెక్యూర్ బబులే.
కరోనా సోకకుండా సురక్షిత వాతావరణంలో క్రికెట్ నిర్వహించడానికి ఈ విధానాన్ని అనుసరించారు. దీని ప్రకారం సిరీస్ ఆరంభానికి మూడు వారాల ముందే ఆటగాళ్లు, సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకుని.. నెగెటివ్ తేలాక హోటల్లో క్వారంటైన్ అవుతారు. రెండు వారాల తర్వాత మరోసారి పరీక్షలు చేసి మ్యాచ్‌కు అనుమతిస్తారు.
ఇక మ్యాచ్ అయ్యేవరకు ఆటగాళ్లతో పాటు ఇతర సిబ్బంది కేవలం స్టేడియాలకు, హోటళ్లకు మాత్రమే పరిమితమవుతారు. వీళ్లను వేరే వాళ్లు కలవరు. ఎవరూ ఈ బబుల్ దాటి బయటికి వెళ్లకూడదు. తద్వారా ఎవరికీ వైరస్ సోకే అవకాశం ఉండదు. ఈ పద్ధతిలో విజయవంతంగా ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్టు సిరీస్ నిర్వహించారు. ఇంగ్లాండ్-పాకిస్థాన్ టెస్టు సిరీస్‌ను బుధవారం నుంచి మొదలుపెడుతున్నారు. వేరే క్రీడల్లోనూ అనుసరిస్తున్న ఈ బయో సెక్యూర్ పద్ధతిని ఇప్పుడు మన దగ్గుబాటి రానా పెళ్లిలోనూ వినియోగిస్తున్నారట.
ఈ నెల 8న అతను మిహీకా బజాజ్‌ను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో పాల్గొనబోయే అతిథులందరి జాబితా తయారు చేసి కొన్ని వారాల ముందు నుంచే అందరికీ పరీక్షలు చేసి క్వారంటైన్ చేశారట. పెళ్లి అయ్యే వరకు వీళ్లెవ్వరూ బబుల్ దాటి బయటికి వెళ్లట్లేదు. పెళ్లికి అవసరమైన అన్నింటినీ ముందే సిద్ధం చేసుకున్నారు. కరోనా భయం లేకుండా స్వేచ్ఛగా, సంతోషంగా పెళ్లి పూర్తి చేయడానికి ఈ ఏర్పాటు చేశారు. ఇది విజయవంతం అయితే తర్వాతి సెలబ్రెటీ పెళ్లిళ్లన్నీ ఈ పద్ధతిలోనే జరుగుతాయేమో.
This post was last modified on August 4, 2020 4:19 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…