ఆర్ఆర్ఆర్ తాలూకు చర్చలు ప్రభావాలు ఆస్కార్ వచ్చాక పూర్తిగా ఆగిపోయాయని అనుకుంటున్నాం కానీ కథ ఇంకా చాలా బాకీ ఉందని ఎప్పటికప్పుడు కొత్త పరిణామాలు సూచిస్తునే ఉన్నాయి. తాజాగా విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ తనకు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయాలని ఉందని ట్రిపులార్ చూశాక ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు సింహాలు పులులతో కలిసి దిగుతూ బ్రిటిషర్ల మీద దాడి చేసే సన్నివేశానికి ఫిదా అయిపోయాయని ఇటీవలే ఒక అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించడం ట్విట్టర్ లో ఇన్స్ టాలో వైరల్ అయిపోయింది.
ఇంతకీ జేమ్స్ గన్ ఎవరంటే వచ్చే నెల 5న విడుదల కాబోతున్న గార్డియన్స్ అఫ్ గాలక్సీ వాల్యూం 3 దర్శకుడు. దీని ముందు రెండు భాగాలు ఎంత పెద్ద సెన్సేషనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే కాదు 2021లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సూసైడ్ స్క్వాడ్ ని తీసింది కూడా ఇతనే. సూపర్ హీరోస్ ని తెరమీద చూపడంలో ప్రత్యేకమైన శైలిని అనుసరించే జేమ్స్ గన్ నెక్స్ట్ చేయబోయే గాలక్సీ యునివర్స్ లో జూనియర్ ని భాగం చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఇలాంటి ఇంటెర్నేషల్ ఫిలిం మేకర్ నుంచి కాంప్లిమెంట్ దక్కడం కన్నా ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంటుంది.
బాలీవుడ్ మల్టీస్టారర్ వార్ 2లో ఎంపిక కావడంతో మొదలు తారక్ తో ఇలాంటి టైఅప్ వార్తలు బలంగా తిరుగుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ తప్ప జూనియర్ ఇంక వేటి గురించి ఆలోచించే పని పెట్టుకోలేదు. ఒకవేళ వార్ 2 కనక త్వరగా మొదలుపెట్టాల్సి వస్తే దానికి అనుగుణంగా డేట్లు అడ్జస్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు తప్పించి అది ఆలస్యమైతే మాత్రం ఎన్టీఆర్ 30 పూర్తయ్యే దాకా తానుగా దేని మీద స్పందించే అవకాశం ఉండకపోవచ్చు. వచ్చే నెల మే 20న పుట్టినరోజు సందర్భంగా టైటిల్ రివీల్ ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
This post was last modified on April 26, 2023 2:33 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…