నేచురల్ స్టార్ నాని లాగే ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. కాకపోతే నానీలాగా అతడికి ఆశించిన విజయాలు దక్కలేదు. ముఖ్యంగా సోలో హీరోగా అతను ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పటిదాకా హిట్టు కొట్టలేకపోయాడు.
రెండేళ్ల కిందట వచ్చిన బ్లఫ్ మాస్టర్ సత్యదేవ్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందనుకున్నారు కానీ.. అది కూడా ఆశించినట్లు ఆడలేదు. ఇక ఈ మధ్యే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన 47 డేస్ కూడా నిరాశకే గురి చేసింది. ఇక అతడి ఆశలన్నీ ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య మీదే నిలిచాయి.
పెద్దగా ప్రచారం లేకుండా ఈ నెల 30న ఉన్నట్లుండి నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైందీ చిత్రం. మరీ పాజిటివ్ రివ్యూలు రాకున్నా.. మోడరేట్ రివ్యూలతోనే ఈ సినిమా మంచి స్పందనే తెచ్చుకుంటున్నట్లుంది. నెట్ ఫ్లిక్స్‌లో టాప్-5లో ట్రెండ్ అవుతోందీ చిత్రం. వ్యూస్ బాగానే వస్తున్నాయి. ట్విట్టర్లో ఈ సినిమా గురించి బాగానే చర్చ నడుస్తోంది. చాలామంది నెటిజన్లు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. రెఫర్ చేస్తున్నారు.
ఇక సత్యదేవ్ పెర్ఫామెన్స్ గురించైతే అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ పాత్రను అతను పండించిన విధానాన్ని కొనియాడుతున్నారు. సత్యదేవ్ లుక్ పట్ల కూడా సానుకూల స్పందన కనిపిస్తోంది. థియేటర్లలో అయితే వసూళ్లను బట్టి సినిమా ఫలితాన్ని అంచనా వేయొచ్చు కానీ.. ఓటీటీ రిలీజ్‌ల విషయంలో సోషల్ మీడియా రెస్పాన్స్‌ను బట్టే అంచనా వేయాలి. దాని ప్రకారం చూస్తే సత్యదేవ్ సోలో హీరోగా తొలి హిట్టు కొట్టినట్లే ఉన్నాడు.
This post was last modified on August 4, 2020 8:23 am
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…