మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో జరుగుతోంది. క్లైమాక్స్ భాగాన్ని భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. 1200 ఫైటర్లతో కనివిని ఎరుగని రీతిలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారట.
మగధీరలో వంద మందిని ఎదురుకుంటేనే ఓ రేంజ్ లో ఊగిపోయిన అభిమానులకు అంతకు పదింతలు అంటే కాళ్ళు ఆగుతాయా. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చే జోరుగా సాగుతోంది. అయితే ఇంత జనం అవసరమైన ఘట్టం వెనుక కథ ఏమై ఉంటుందానే సస్పెన్స్ అందరిలోనూ ఉంది
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఎన్నికల అధికారిగా నటిస్తున్న చరణ్ విలన్ ఎస్ జె సూర్య వేసిన స్కెచ్ వల్ల ఒక సమస్యాత్మక నియోజకవర్గం పోలింగ్ ని పర్యవేక్షించేందుకు ప్రత్యక్షంగా అక్కడికి వస్తాడు. వేలాదిగా గుమికూడిన ఓటర్లలో రౌడీ షీటర్లు కలిసిపోయి ఉంటారు.
వాళ్ళను ఢీ కొట్టే సన్నివేశాలతో పాటు ఎవరూ ఊహించని ఒక ప్రీ క్లైమాక్స్ ట్విస్టు వస్తుందట. ఇవన్నీ భాషతో సంబంధం లేకుండా ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులందరికీ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటుందని వినికిడి. దీని తాలూకు చిన్న లీక్డ్ వీడియోలు బయటికి వస్తే యూనిట్ వాటిని వెంటనే తీయించే పనిలో పడ్డారు.
చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న గేమ్ చేంజర్ విడుదల ఇంకా ఖరారు చేయలేదు. ఇండియన్ 2 అయ్యేదాకా శంకర్ ఏ విషయం చెప్పలేదని నిస్సహాయత వ్యక్తం చేయడంతో నిర్మాత దిల్ రాజు ఏ సందర్భంలో అడిగినా మాట దాటేస్తున్నారు. పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ లో హీరొయిన్ కియారా అద్వానీకి సైతం యాక్షన్ బ్లాక్స్ పెట్టారు. చరణ్ తను కలిసి చేసిన వర్కౌట్ తాలూకు విజువల్స్ ట్విట్టర్ లో చక్కర్లు కొడుతున్నాయి. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న గేమ్ చేంజర్ 2024 వేసవి విడుదలకు ప్లాన్ చేసినట్టుగా టాక్
This post was last modified on April 26, 2023 3:31 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…