చాలా గ్యాప్ తర్వాత విరూపాక్ష రూపంలో బలమైన కంబ్యాక్ అనుకున్న సాయి ధరమ్ తేజ్ ఆనందం మాములుగా లేదు. ఓ మోస్తరు హిట్ అయినా చాలనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ ఫలితం దక్కడం పట్ల యూనిట్ మొత్తం గాల్లో తేలుతోంది. పైగా మే 5న హిందీ వెర్షన్ ని విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను ప్యాన్ ఇండియా లెవెల్ లో చేయాలని డిసైడయ్యారు. శుక్రవారం ఏజెంట్, పీఎస్ 2 వచ్చాక వాటి రిపోర్టులను బట్టి ప్లానింగ్ లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇదిలా ఉండగా తేజు నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే ఉంది.
సంపత్ నందితో సాయిధరమ్ తేజ్ ప్రాజెక్టు లాకయ్యే దిశగా వెళ్తోంది. నిన్న అభిమానులతో ట్విట్టర్ వేదికగా జరిపిన చిట్ చాట్ లో భాగంగా ఒక అభిమాని మాస్ సినిమా చేయొచ్చుగా అని అడిగాడు. దానికి తేజు సమాధానమిస్తూ ఏంటి సంపత్ నంది సిద్ధమేనా అంటూ ట్యాగ్ చేయడం అతనూ వెంటనే లైన్ లోకి వచ్చి ఔనన్నట్టు సంకేతం ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అఫీషియల్ గా ఇంకా ప్రకటించనప్పటికీ మొత్తానికి ఇద్దరూ ఓకే అనుకున్న మాట వాస్తవమేనని అర్థమవుతోంది. విరూపాక్ష 2 ఉంటుందని ఇటీవలే హింట్ ఇచ్చిన తేజు ముందు ఏది చేస్తాడో చూడాలి
అయితే సంపత్ నంది చాలా ఏళ్లుగా ఫామ్ లో లేడు. రచ్చ సక్సెస్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం చూడలేదు. బెంగాల్ టైగర్, గౌతమ్ నందా, సీటిమార్ ఏవీ యునానిమస్ గా హిట్ అనిపించుకోలేదు. మధ్యలో కథకుడిగా నిర్మాతగా పలు సినిమాలు చేశాడు కానీ డైరెక్టర్ గా మాత్రం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. మరి సాయి ధరమ్ తేజ్ కి ఎలాంటి కథ రాసుకున్నాడో చూడాలి. విరూపాక్ష తర్వాత తేజు నుంచి ఆడియన్స్ ఏంతో కొంత ప్రత్యేకంగా ఆశిస్తారు. అలాంటప్పుడు మళ్ళీ రొటీన్ బాట ఎక్కకపోతే చాలు. అప్పట్లో ఇంటెలిజెన్స్ పొరపాటు రిపీట్ అవ్వకపోతే అదే పదివేలు
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…