కేవలం నాలుగు రోజులకే 24 కోట్ల బ్రేక్ ఈవెన్ ని ఒంటి చేత్తో అందుకున్న విరూపాక్షకు ఇకపై వచ్చే ప్రతి రూపాయి లాభం కిందకే వస్తుంది. ఇంకా చూడని ప్రేక్షకులు చాలా ఉన్నారు కాబట్టి ఇంకో పది రోజుల వరకు నిక్షేపంగా వసూళ్లు రాబట్టుకోవచ్చు. ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2లు ఉన్నా వాటి జానర్లు లక్ష్యాలు వేరు కాబట్టి తేజు టీమ్ కొచ్చిన టెన్షన్ ఏమీ లేదు. ముఖ్యంగా బిజినెస్ టార్గెట్ ని ఇంత త్వరగా అందుకున్నాక ఏ విషయంలోనూ ఆందోళన ఉండదు. ఇప్పుడు విరూపాక్ష బృందం హిందీ మార్కెట్ మీద సీరియస్ గా దృష్టి పెట్టబోతోంది.
బాలీవుడ్ డబ్బింగ్ వెర్షన్ ని మే 5 విడుదల చేయబోతున్నారు. ఆ మేరకు ప్లానింగ్ జరిగిపోయింది. సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ వల్ల థియేటర్లు దొరకవన్న కారణంగా తెలుగుతో పాటు ముందు అనుకున్న నార్త్ రిలీజ్ ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈలోగా విరూపాక్షకు యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ ఫలితం వచ్చేయడంతో ఇదే రిజల్ట్ ఉత్తరాదిలోనూ రిపీట్ అవుతుందన్న నమ్మకం నిర్మాతల్లో ఉంది. దానికి ఉదాహరణగా గత ఏడాది నిఖిల్ కార్తికేయ 2ని చూపిస్తున్నారు. అది కూడా స్లో పాయిజన్ లాగా అక్కడి రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే
అయితే విరూపాక్షలో దైవత్వానికి సంబంధించిన అంశాల కన్నా దెయ్యాలు చేతబడులు మీద సాగే హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల హిందీ జనాలు ఎంతమేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. చంద్రముఖి లాంటి వాటిని ఆదరించిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఛాన్స్ లేకపోలేదు. మే 5న అఫ్వా, హం బంజారే తప్ప చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. ఇవి కూడా స్టార్ క్యాస్టింగ్ లేనివి. హాలీవుడ్ మూవీ గార్డియన్స్ అఫ్ గాలక్సీ వాల్యూం 3 మాత్రమే రేస్ లో ఉంది. సో రుద్రవనం కాన్సెప్ట్ కనక కనెక్ట్ అయితే మాత్రం తేజుకి హిందీలో మంచి డెబ్యూ దక్కినట్టే