అఖిల్ , సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన స్పై యాక్షన్ మూవీ ‘ఏజెంట్’ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమా ప్రకటించిన డేట్ కి వస్తుందా ? లేదా అనే అనుమానాలు మొన్నటి వరకు ఉన్నాయి. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వడం , సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికెట్ రావడంతో ఈ సినిమా రిలీజ్ మీద ఉన్న అన్నీ సందేహాలకి క్లారిటీ వచ్చేసింది. నిజానికి ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినప్పటికే కొంత వర్క్ పెండింగ్ ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంకా టైమ్ కావాలని కోరినా నిర్మాత అనిల్ సుంకర ఎట్టి పరిస్థితిలో ఇదే డేట్ కి వెళ్లిపోదామని ఒప్పించారు.
బహుశా వదిలితే ఇంకా కొన్ని నెలలు సురేందర్ రెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద వర్క్ చేస్తే, అసలుకే మోసం జరుగుతుందని భావించి నిర్మాత డేట్ లాక్ చేసేసి సూరి అండ్ టీం ను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఏజెంట్ ను అన్నీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు సమయం లేకపోవడంతో తెలుగు, మలయాళం రెండు భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అఖిల్ కొన్ని రోజుల ముందే రంగంలోకి దిగాడు. కానీ టైమ్ సరిపోకపోవడంతో అనుకున్నత ప్రమోషన్స్ చేయలేకపోయారు. ఇక ఏజెంట్ కి లాస్ట్ మూమెంట్ వరకూ సురేందర్ రెడ్డి నిద్రమానుకొని వర్క్ చేయాల్సి వచ్చింది. సెన్సార్ డబ్బింగ్ కరెక్షన్ చెప్పడంతో అఖిల్ ఉన్నపలంగా ప్రమోషన్స్ ను పక్కన పెట్టేసి డబ్బింగ్ కరెక్షన్ చెప్పాల్సి వచ్చింది. ఏదేమైనా ఏజెంట్ టీం రిలీజ్ డేట్ ను అందుకునేందుకు జెట్ స్పీడులో పనిచేయాల్సి వచ్చింది. మరి తెలుగు ఇండస్ట్రీ హిట్లు ఉన్న ఈ లక్కీ డేట్ అఖిల్ కి ఎలా కలిసొస్తుందో చూడాలి.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…