‘బాహుబలి’ తర్వాత చేసిన రెండు సినిమాలు తేడా కొట్టినా.. ప్రభాస్ జోరేమీ తగ్గలేదు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కే లాంటి భారీ చిత్రాలతో పాటు మారుతి సినిమాను లైన్లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగతోనూ సినిమా కమిటయ్యాడు. ఇందులో నాలుగు సినిమాలు ఏడాది వ్యవధిలో విడుదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రం గురించి రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో ప్రభాస్ ఓ సినిమా కమిటైనట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అనే విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.
రాజమౌళి అయితే సమీప భవిష్యత్తులో ఈ సినిమా చేసే అవకాశాలు కనిపించడం లేదు. జక్కన్నతో సినిమా చేయాలంటే మూడేళ్లయినా ఆగాలి. ఆర్కా మీడియా వారికి అంత వరకు ఆగే ఉద్దేశం లేదు. వారి దృష్టిలో వేరే దర్శకుడు ఉన్నాడన్నది విశ్వసనీయ సమాచారం.
విలక్షణ దర్శకుడు క్రిష్‌తో ప్రభాస్ హీరోగా సినిమా చేయాలన్నది శోభు, ప్రసాద్‌ల ఆలోచన. వీరితో క్రిష్‌కు మంచి అనుబంధమే ఉంది. ‘వేదం’ సినిమాకు శోభు, ప్రసాద్ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించారు కూడా. క్రిష్‌తో కలిసి ఒక కథ మీద శోభు, ప్రసాద్ చాన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నారు.
ఇంకా కథ ఒక కొలిక్కి రాలేదు కానీ.. ఈ లోపే ప్రభాస్ వారికి సినిమా చేయడానికి మాట ఇచ్చాడు. ఎలాగైనా ఈ కథను వర్కవుట్ చేసి ప్రభాస్, క్రిష్ కాంబినేషన్లో సినిమా చేయాలన్నది ఆర్కా మీడియా వారి ఆలోచన. ప్రస్తుతం క్రిష్.. పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి భారీ చిత్రం తీసిన అనుభవంతో ప్రభాస్‌తోనూ చారిత్రక నేపథ్యం ఉన్న కథను తీయాలని క్రిష్ భావిస్తున్నాడు. శోభు, ప్రసాద్‌లకు మంచి అభిరుచి, ప్రొడక్షన్ మీద పట్టు ఉండటంతో ఈ కలయికలో ఒక మెగా మూవీని ఆశించవచ్చు.
This post was last modified on April 25, 2023 5:49 pm
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…