‘సైరా’ తర్వాత వరుసబెట్టి సినిమాలు ఒప్పుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఉన్నట్లుండి తర్వాత ఏ సినిమా చేయాలో తెలియని అయోమయంలో పడిపోయాడు. ప్రస్తుతం ‘భోళా శంకర్’లో నటిస్తున్న చిరు.. ముందు అనుకున్న ప్రకారం అయితే వెంకీ కుడుములతో సినిమా చేయాల్సింది. కానీ కథ విషయంలో సంతృప్తి చెందక ఆ చిత్రాన్ని పక్కన పెట్టాడు. ఇంకో రెండు నెలల్లో ‘భోళా శంకర్’ను పూర్తి చేయనున్న చిరు.. ఆ తర్వాత పట్టాలెక్కించాల్సిన సినిమా కోసం కథలు వింటున్నారు.
ఐతే ఒకటి రెండు అని కాకుండా ఆయన చాలా ఆప్షన్లే లైన్లో పెట్టుకున్నాడు. చిరును ఎలాగైనా మెప్పించాలని వశిష్ఠ (బింబిసార ఫేమ్)తో పాటు బీవీఎస్ రవి, కళ్యాణ్ కృష్ణ, ప్రసన్న కుమార్ బెజవాడ ప్రయత్నిస్తున్నారు. వీళ్లందరూ చిరుకు లైన్ వినిపించి.. ఫుల్ స్క్రిప్టు మీద పని చేస్తున్న వారే. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకో కొత్త పేరు వచ్చినట్లు తాజా సమాచారం.
ఇటీవలే ‘దసరా’ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీద చిరు దృష్టి పడ్డట్లు సమాచారం. ‘దసరా’ను నిర్మించిన సుధాకర్ చెరుకూరికే తన రెండో సినిమాను కూడా చేయబోతున్నాడు శ్రీకాంత్. చిరుతో ఎలా యాక్సెస్ దొరికిందో కానీ.. అతను ఆయనకు ఒక లైన్ చెప్పినట్లు సమాచారం. మిగతా వాళ్లకు చెప్పినట్లే శ్రీకాంత్‌కు కూడా ప్రాథమికంగా హామీ ఇచ్చి.. కథ మీద వర్క్ చేసుకున్నారట చిరు. అంటే లైన్ ఓకే, ఫుల్ స్క్రిప్టు కూడా నచ్చితే సినిమా చేస్తా అన్నది ఆయన మాట.
దసరా చూసి ఇంప్రెస్ అయిన చిరు.. మంచి కథ చెబితే మిగతా వాళ్లను పక్కన పెట్టి శ్రీకాంత్‌తో సినిమా చేయడానికి రెడీ అన్నట్లే. మరి శ్రీకాంత్ ఇప్పుడు ఎంత మంచి కథతో వస్తాడు అన్నది కీలకం. అతడికి రెండు నెలల సమయం ఉంది. శ్రీకాంత్ ప్రస్తుతం తనకు పరిచయం ఉన్న మంచి రైటర్లతో కలిసి కథ వండే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
This post was last modified on April 25, 2023 2:01 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…