వరసగా కొత్త సినిమాల రిలీజులతో బాక్సాఫీస్ వద్ద సందడి పెరగబోతోంది. విరూపాక్ష ఊహించిన దానికన్నా పెద్ద విజయం సాధించడంతో రెండో వారం అగ్రిమెంట్లు పొడిగించబడుతున్నాయి. ఈ వారం వచ్చే ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2కి తగినన్ని స్క్రీన్లు వచ్చేలా చేయడంలో బయ్యర్లు సులభంగా మేనేజ్ చేసుకున్నారు. తేజు మూవీకి వీక్ డేస్ లోనూ స్టడీగా కలెక్షలు రావడంతో పైన రెండింటి టాక్ ని బట్టి మళ్ళీ థియేటర్లు పెంచాలా వద్దానే నిర్ణయం తీసుకంటారు. ఇప్పటికైతే కేటాయింపులు దాదాపు ఒక కొలిక్కి వచ్చేశాయి. అసలు కథ ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతోంది.
మే 5న గోపీచంద్ రామబాణం, అల్లరి నరేష్ ఉగ్రంలు వస్తాయి. ఒకవేళ అఖిల్ బొమ్మకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం స్క్రీన్ కౌంట్ అప్పటికి భారీగా తగ్గించే ఛాన్స్ ఉండదు కాబట్టి ఉన్నంతలో కొత్తవాటికి సర్దాల్సి ఉంటుంది. పీఎస్ 2 ఏదైనా తేడా కొట్టినా నైజామ్, వైజాగ్ లాంటి ప్రాంతాలు దిల్ రాజు కొన్నారు కాబట్టి కేవలం ఏడు రోజులకే తీసేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆపై 12న చైతు కస్టడీ మీద మంచి అంచనాలున్నాయి. తమ్ముడి సందడి అప్పటికంత తగ్గుతుంది కాబట్టి సహజంగానే దీనికి బయ్యర్ల మద్దతు ఉంటుంది. బిచ్చగాడు 2 మీద ప్రస్తుతానికి బజ్ లేకపోయినా తక్కువ అంచనా వేయడానికి లేదు.
అటుపై 18న అన్నీ మంచి శకునములే వస్తోంది. సంతోష్ శోభన్ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా వైజయంతి సంస్థ నుంచి వస్తోంది కాబట్టి సీతారామం రేంజ్ లో రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు శ్రీవిష్ణు సామజవరగమన ఉంది. ఇదీ కంటెంట్ నమ్ముకుని వస్తున్నదే. మేలో వచ్చే సినిమాలన్నీ హీరోల ఇమేజ్ కన్నా కథలు దర్శకుల టేకింగ్ మీద ఆధారపడి వస్తున్నవి. వేసవి సెగలు గట్టిగా ఉన్న టైంలో జనాన్ని థియేటర్లకు రప్పించడం వీటికి పెద్ద సవాలే. బాగుంటే వాతావరణాన్ని లెక్క చేయమని ఆడియన్స్ నిరూపిస్తున్నారు కాబట్టి దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్లదే.
This post was last modified on April 25, 2023 11:40 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…