మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్, ఆయన బావ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా కనిపించేవాళ్లు. అందుకు తగ్గట్లే మెగా అభిమానుల్లో కూడా వీరి మీద ఒకే రకమైన అభిమానం ఉండేది.
ఇప్పుడు కూడా చరణ్, బన్నీ సన్నిహితంగా ఉండొచ్చు కానీ.. బయటికి మాత్రం వారిని శత్రువుల్లా చూస్తున్నారు మెగా అభిమానులు. రకరకాల కారణాల వల్ల మెగా అభిమానుల్లోనే వర్గాలు ఏర్పడి.. బన్నీ వర్గం పూర్తిగా వేరుపడిపోయింది.
చరణ్, బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా అవతలి హీరోలను ట్రోల్ చేయడం, అదే పనిగా గొడవ పడటం మామూలైపోయింది. బన్నీ ఇంతకుముందులా చిరు, చరణ్‌ల గురించి మాట్లాడట్లేదంటూ అతణ్ని టార్గెట్ చేస్తుంటుంది మెగా అభిమానుల్లో ఒక వర్గం.
ఐతే ఒక సందర్భం చూసుకుని ఇప్పుడు వాళ్లందరికీ సమాధానం చెప్పాడు బన్నీ. కొన్ని నెలల కిందటే చరణ్ భార్య ఉపాసన గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పుట్టింటి వారు ఆమెకు బేబీ షవర్ కార్యక్రమం నిర్వహించారు. తాజాగా చిరు కుటుంబం కూడా తమ వైపు నుంచి ఆ వేడుక చేసింది.
ఈ వేడుకకు బన్నీ కూడా కుటుంబంతో సహా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఉపాసనతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బన్నీ.. దానికి అందమైన వ్యాఖ్య కూడా జోడించాడు. ‘‘Upsi RC Life.. Soo happy for my Sweetestt Upsi’’ అని బన్నీ కామెంట్ పెట్టాడు. ఇది చూసి చరణ్, ఉపాసనల మీద బన్నీకి ఎంత ప్రేమో చెప్పడానికి ఈ పోస్టే నిదర్శనం అని.. ఊరికే బన్నీ, చరణ్‌ల మధ్య జరిగిపోయినట్లు ఊహించుకుని అనవసర ఫ్యాన్ వార్స్ మానుకోవాలని ఇరువురి మ్యూచువల్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on April 24, 2023 2:23 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…