టాలెంట్ ఉండాలే కానీ కొత్త పాత సంబంధం లేకుండా దర్శకులు ఎవరైనా సరే మెప్పించే కంటెంట్ ఉంటే అద్భుతాలు చేయొచ్చని 2023 వేసవిలో ముగ్గురు దర్శకులు నిరూపించారు. ఒకపక్క క్రియేటివ్ లెజెండరీ అని పేరు తెచ్చుకున్న డైరెక్టర్లు పట్టుమని మూడు రోజులు ఆడలేని చిత్రాలతో నీరసం తెప్పిస్తుంటే మరోవైపు సృజనాత్మకతకు బడ్జెట్ లు బౌండరీలు అవసరం లేదని మరికొందరు నిరూపిస్తున్నారు. ముందుగా చెప్పుకోవాల్సిన పేరు వేణు యెల్దండి. ప్రియదర్శి లాంటి ఒకరిద్దరు తప్ప పేరున్న క్యాస్టింగ్ లేకుండా తీసిన బలగం తెలంగాణలో మారుమూల పల్లెలకు చొచ్చుకుపోయింది.
కరీంనగర్ లాంటి జిల్లా కేంద్రంలో ఎనభై లక్షలు వసూలు చేసినా, హైదరాబాద్ లో యాభై రోజులు ఆడినా, జనం మైదానాలలో షోలు వేసుకున్నా అదంతా బలగంలోని భావోద్వేగాలకు బలంగా కనెక్ట్ అవ్వడం వల్లే. బ్లాక్ బస్టర్ అనే పదం దీని ముందు చిన్నదే. రెండో పేరు శ్రీకాంత్ ఓదెల. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాని లాంటి న్యాచురల్ స్టార్ ని ఊర మాస్ పాత్రలో చూపించిన దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు దాటేసి ఔరా అనిపించుకుంది. సుకుమార్ శిష్యరికంలో ఆరితేరిన శ్రీకాంత్ నుంచి అంత గొప్ప అవుట్ ఫుట్ ఎవరూ ఊహించలేదన్న మాట వాస్తవం.
ఇక మూడో వ్యక్తి కార్తీక్ దండు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం భం బోలేనాథ్ అనే చిన్న సినిమాతో ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయిన ఇతను ఇంత సుధీర్ఘమైన నిరీక్షణకు తెరదించుంటూ ఒక హారర్ సబ్జెక్టుతో విరూపాక్ష రూపంలో ఘనవిజయం సాధించడం చిన్న విషయం కాదు. యాక్సిడెంట్ వల్ల విశ్రాంతి, రిపబ్లిక్ ఫ్లాప్ లాంటి గాయాల నుంచి బలమైన కంబ్యాక్ కోరుకున్న సాయిధరమ్ తేజ్ కి పెద్ద హిట్టు చేతిలో పెట్టాడు. మాడుపగిలిపోయే ఎండల్లో బయటికి రావాలా వద్దాని జనం తటపటాయిస్తున్న ట్రెండ్ లో ఇంత సక్సెస్ అందుకున్న ఈ ముగ్గురూ అసాధ్యులు కాక మరేమిటి
This post was last modified on April 24, 2023 12:44 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…