Movie News

నాయ‌ట్టు రీమేక్‌లో ట్విస్ట్

మ‌ల‌యాళంలో గ‌త కొన్నేళ్ల‌లో వ‌చ్చిన బెస్ట్ థ్రిల్ల‌ర్ల‌లో నాయ‌ట్టు ఒక‌టి. గ‌త ద‌శాబ్ద కాలంలో ద‌క్షిణాదిన వెలుగులోకి వ‌చ్చిన ఉత్త‌మ న‌టుల్లో ఒక‌డైన జోజు జార్జ్‌తో పాటు కుంచుకో బోబ‌న్ ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించారు. మ‌న‌ వ్య‌వ‌స్థ‌లో లోపాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపిస్తూ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగే ఈ సినిమా.. చూసిన‌ ప్రేక్ష‌కుల‌ను చాన్నాళ్లు వెంటాడుతుంది. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు గ‌త ఏడాది వార్త‌లు వ‌చ్చాయి.

రావు ర‌మేష్‌ను జోజు జార్జ్ పాత్ర‌కు ఎంపిక చేయ‌డం.. క‌రుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి గీతా ఆర్ట్స్ సంస్థ స‌న్నాహాలు చేయ‌డం గురించి జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి కొన్ని రోజుల్లో షూటింగ్ కూడా మొద‌ల‌వుతుంద‌ని అన్నారు. కానీ ఇంత‌లో ఏమైందో ఏమో.. ఆ సినిమా ఆగిపోయింది.

నాయ‌ట్టు లాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌డం స‌రైన ఆలోచ‌న కాద‌ని, ఆ సినిమా ఇక్క‌డ వ‌ర్క‌వుట్ కాద‌ని ఆపేశారేమో అనుకున్నారు. కానీ కొంచెం గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ ఆ సినిమా తెర‌పైకి వ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమా కాస్టింగ్ విష‌యంలో కీల‌క మార్పులు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. జోజు జార్జ్ పాత్ర‌కు రావు ర‌మేష్‌ను కాకుండా సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్‌ను ఎంచుకున్నార‌ట‌. నిమిష పాత్ర‌కు శివాత్మిక రాజ‌శేఖ‌ర్, కుంచుకో బోబ‌న్ క్యారెక్ట‌ర్‌కు రాహుల్ విజ‌య్‌ల‌ను తీసుకున్నార‌ట‌. సినిమాలో కీల‌క‌మైన లేడీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ను వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌తో చేయిస్తున్నార‌ట‌.

ఈ సినిమాకు కోట‌బొమ్మాళి పోలీస్ స్టేష‌న్ అనే టైటిల్ కూడా ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. క‌రుణ్ కుమారే సినిమా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కుముందు అనుకున్న దాని కంటే త‌క్కువ బ‌డ్జెట్లో ఈ సినిమాను తీస్తున్నార‌ట‌. ఆల్రెడీ షూటిగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా గురించి త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

2 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

3 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

3 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

6 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

8 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

8 hours ago