అక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. నాగార్జున చిన్న కొడుక అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్లో తెరకెక్కిన ‘ఏజెంట్’ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో అఖిల్ రాత మారిపోతుందని.. అతడి కెరీర్ ఊపందుకుంటుందని.. తనకు మాస్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరుగుతాయని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇది పక్కా యాక్షన్ ఫిలిం కావడం.. భారీ బడ్జెట్లో తెరకెక్కడం.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడం.. మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం అంచనాలను పెంచేవే. కానీ ఈ సినిమా టీజర్, ట్రైలర్ల మీద మిక్స్‌డ్ టాక్ వచ్చింది. చూడ్డానికి సుకుమారంగా కనిిపంచే అఖిల్‌ను అంత వైల్డ్‌గా చూపించడం.. అతను అంతలా బాడీ పెంచి కనిపించడం సెట్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
వైల్డ్ వైల్డ్ అంటూ ఓవర్ ద టాప్ వెళ్లిపోయారని.. యాక్షన్ పరంగా విక్రమ్, కేజీఎఫ్-2 లాంటి సినిమాలను అనుకరిస్తూ కొంచెం అతి చేసినట్లున్నారనే కామెంట్లు కూడా వినిపించాయి. ఐతే ఈ కామెంట్ల సంగతి పక్కన పెడితే.. అఖిల్ గత సినిమాలతో పోలిస్తే యూత్, మాస్‌లో ఈ సినిమాపై ఆసక్తి ఎక్కువే ఉందన్నది వాస్తవం. మాస్ టచ్ ఉన్న యాక్షన్ సినిమాలకు ఉండే అడ్వాంటేజ్ అది.
ఈ క్రేజ్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ప్రతిఫలిస్తుందని భావిస్తున్నారు. ఆల్రెడీ బుక్ మై షోలో ఈ సినిమాకు లక్షకు పైగా ఇంట్రెస్ట్‌లు వచ్చాయి. అక్కడక్కడా కొన్ని షోలకు బుకింగ్స్ ఓపెన్ చేస్తే టికెట్లు వేగంగానే తెగుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పూర్తి స్తాయిలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇదే ట్రెండ్ కొనసాగి జోరుగా టికెట్లు తెగితే.. సినిమాకు మంచి ఓపెనింగ్స్ ఆశించవచ్చు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అఖిల్ కోరుకున్న సక్సెస్ కూడా సొంతం కావచ్చు. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on April 24, 2023 6:11 am
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…