Movie News

అఖిల్ 4 నెలలనుకుంటే 10 నెలలు పట్టింది

అక్కినేని అఖిల్ తన కెరీర్లో అతి పెద్ద బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. హీరోగా తన కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద సక్సెస్ చూడకపోయినా.. అతడి మీద భరోసాతో ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టి ‘ఏజెంట్’ సినిమాను నిర్మించాడు నిర్మాత అనిల్ సుంకర. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించాడు.

ఈ శుక్రవారమే ‘ఏజెంట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ చూడ్డానికి సాప్ట్‌గా కనిపిస్తాడు కానీ.. ఈ సినిమాలో మాత్రం వైల్డ్ క్యారెక్టర్ చేశాడు. కళ్లు చెదిరే రీతిలో బాడీ పెంచి, వైల్డ్ లుక్‌లోకి మారిన అఖిల్.. వయొలెంట్‌గా కనిపించే పాత్రను పోషించాడు. ఈ పాత్ర కోసం తాను పడ్డ కష్టం గురించి అతను మీడియాతో మాట్లాడాడు.

తెర మీద కనిపిస్తున్న లుక్ కోసం అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ టైమే పట్టిందని అఖిల్ తెలిపాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేస్తున్న సమయంలో ఏదో కొత్తగా చేయాలి అనే ఆలోచన కలిగి ‘ఏజెంట్’ చేసినట్లు అఖిల్ వెల్లడించాడు.

‘‘బేసిగ్గా నాకు యాక్షన్ సినిమాలంటే పిచ్చి. ఆ జానర్‌లో భారీ స్థాయిలో కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నా. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేస్తున్నపుడు ఇంకా ఏదో చేయాలి అనిపించేది. అలా అని ఆ సినిమాను తక్కువ చేయను. ఆ కథ వరకు అది బాగుంటుంది. ఆ సమయంలో ఆత్మ విమర్శ చేసుకున్నాను. అందరికీ నేనేంటో తెలిసేలా స్పై యాక్షన్ థ్రిల్లర్ చేయాలనిపించింది. అప్పుడు సురేందర్ రెడ్డి కలిస్తే పుట్టిందే ఏజెంట్ కథ. ఈ సినిమా కోసం లుక్ మార్చుకోవాలని సూరి చెప్పాడు. నాలుగు నెలలు కష్టపడితే నేను కోరుకున్న బాడీ వచ్చేస్తుందని అనుకున్నా. కానీ ఆ ఆకృతి రావడానికి పది నెలలు పట్టింది. కోరుకున్న లుక్ వచ్చాకే తొలి సీన్ తీశారు. ఆలస్యమైనా సరే.. నేను పడ్డ కష్టం తెరపై కనబడుతుంటే చాలా సంతోషంగా ఉంది. సూరి కథ, సినిమాలో సీన్లు చెబుతున్నపుడు నేను చేయగలనా అనిపించింది. ముఖ్యంగా ఇందులో నన్ను హింసించే సీన్ విన్నపుడు ఇది నా వల్ల అవుతుందా అనుకున్నా. చివరికి అన్నీ చేయగలిగాను’’ అని అఖిల్ తెలిపాడు.

This post was last modified on April 23, 2023 2:54 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

4 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

5 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

5 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

6 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

8 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

9 hours ago