Movie News

వామ్మో ఇదెక్కడి హారర్ బాబోయ్

హాలీవుడ్ లో క్రేజీ హారర్ మూవీ సిరీస్ గా పేరున్న ఎవిల్ డెడ్ కొత్త భాగం మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. 1981 తో మొదలుపెట్టి ఇప్పటిదాకా వచ్చిన వాటిలో ఇది అయిదో భాగం. టైటిల్ కి రైజ్ అని జోడించి ట్రైలర్ దశ నుంచే ఆసక్తి పెరిగేలా చేశారు. ఎన్నడూ లేనిది దెయ్యాల సినిమాకు ఇండియాలో ముందు రోజు అర్ధరాత్రి ప్రీమియర్లు వేయడం ఒక్క దీని విషయంలోనే జరిగింది. అంతగా ఆత్మల ప్రియులు ఈ మూవీ కోసం ఎదురు చూశారు. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అంతగా ఇందులో ఏముందనే ఆసక్తి రేగడం సహజం. అదేంటో చూద్దాం.

ట్రెడిషనల్ గా ఎప్పుడూ అడవిలో సాగే ఎవిల్ డెడ్ ని ఈసారి నగరానికి మార్చారు. అక్క ఎల్లి(అల్లీసా సదర్లాండ్)ని కలుసుకోవడం కోసం ఆమె ఉండే అపార్ట్ మెంట్ కు వస్తుంది బెత్(లిలీ సులివాన్). ఆమె కొడుకు సెల్లార్ లో అనుకోకుండా దొరికిన ఓ పాత పుస్తకం, కొన్ని గ్రామ్ ఫోన్ రికార్డులు ఫ్లాట్ కి తీసుకోచ్చి వాటిని చదివి ప్లే చేస్తాడు. దీంతో దెయ్యం బయటికి వచ్చి ఎల్లీని ఆవహించి ఒక్కొక్కరిని చంపడం వాళ్ళను భూతంగా మార్చడం మొదలుపెడుతుంది. దీంతో చిన్న కూతురుని తీసుకుని బేస్ మెంట్ కు పరిగెత్తిన బెత్ చివరికి ఎలా ప్రాణాలతో బయటపడిందన్నదే స్టోరీ.

విపరీతమైన హింసతో ఒళ్ళు గగుర్పొడిచే భయానక భీభత్స దృశ్యాలతో ఈవిల్ డెడ్ రైజ్ ని రూపొందించాడు దర్శకుడు లీ క్రోనిన్. క్లైమాక్స్ లో లిఫ్ట్ లో రక్తం సముద్రంగా ప్రవహించే ఎపిసోడ్, దెయ్యాలన్నీ ఓ విచిత్ర ఆకారంలో బెత్ వెంట పడ్డాక జరిగే దృశ్యాలు కళ్ళు మూసుకోకుండా చూడటం కష్టం. ఒకదశలో ఇంత వయొలెన్స్ చూస్తే హార్ట్ పేషెంట్స్ తట్టుకోవడం కష్టమే అనిపిస్తుంది. పొరపాటున కూడా పిల్లలకు చూపించకూడని చాలా సీన్లు డిస్టర్బ్ చేస్తాయి. మొదటి రెండు భాగాలతో పోల్చుకునేంత గొప్పగా లేదు కానీ ఈ జానర్ ని విపరీతంగా ప్రేమించేవాళ్ళకు నచ్చుతుంది. మిగిలినవాళ్ళు దూరంగా ఉంటే బెటర్

This post was last modified on April 23, 2023 2:45 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

6 minutes ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

51 minutes ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

2 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

2 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

2 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

3 hours ago