మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా తమిళనాడులో రికార్డులు బద్దలు కొట్టిందని చెప్పుకుంటున్న పొన్నియిన్ సెల్వన్ 1 సీక్వెల్ కి ఆశించినంత హైప్ లేకపోవడం నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో బజ్ అంతంతమాత్రంగా ఉండటంతో ఓపెనింగ్స్ తో పాటు బిజినెస్ విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఒరిజినల్ వెర్షన్ ఎంత గొప్పగా ఆడినా డబ్బింగ్ లో మాత్రం పీఎస్ 1 సోసోగా ఆడిన మాట వాస్తవం. చోళుల కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో జరిగిన తడబాటు వల్ల రెండో భాగం మీద ఆసక్తి రావడం లేదు.
నిన్న బెంగళూరులో ఓ ఈవెంట్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా వేడుక జరగబోతోంది. నిర్మాత దిల్ రాజు పంపిణి చేస్తుండటంతో థియేటర్లైతే దక్కుతున్నాయి కానీ జనాన్ని రప్పించడం టీమ్ కి సవాల్ గా మారింది. విరూపాక్ష బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. రెండో వారంలో నెమ్మదించే అవకాశాలు తక్కువే. మరోవైపు ఏజెంట్ ని భారీ ఎత్తున అదే రోజున విడుదల చేస్తున్నారు. స్క్రీన్లు, బెనిఫిట్ షోలు, హంగామా దీని లెక్క వేరుగా ఉంటుంది. వీటి మధ్య పీఎస్ 2 ఆడియన్స్ కి ఆకట్టుకోవడం అంత సులభం కాదు. ఎంత గ్రాండియర్ అయినా కంటెంట్ ముఖ్యం
రాబోయే నాలుగు రోజులు పీఎస్ 2కి కీలకంగా మారబోతున్నాయి. టాక్ గొప్పగా వస్తే ఇబ్బంది లేదు కానీ ఏ మాత్రం అటుఇటు అయినా అంతే సంగతులు. ఏఆర్ రెహమాన్ సంగీతం సైతం ఏమంత చొచ్చుకుపోలేదు. ఫస్ట్ పార్ట్ అతి కష్టం మీద పది కోట్లకు దగ్గరగా వెళ్ళింది. ఇప్పుడీ రెండో భాగాన్ని ఎంతకు బిజినెస్ చేశారో ఇంకా బయటికి రావడం లేదు మొత్తానికి దానికన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. నిర్మాణ సంస్థ లైకా మాత్రం నిశ్చింతగా ఉంది. ఎలాగూ ప్రైమ్ తో భారీ ఓటిటి డీల్ జరిగిపోయింది. వేరే భాషల్లో ఆడినా ఆడకపోయినా తమిళం నుంచే గంపెడు లాభాలు మూటగట్టుకోవచ్చు.
This post was last modified on April 23, 2023 11:12 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…