Movie News

ఈ కలెక్షన్లతో గండం గట్టెక్కేదెలా?

కరోనా తర్వాత బాలీవుడ్ టాప్ స్టార్లలో చాలామంది తమ స్టార్ డమ్, మార్కెట్ దెబ్బ తిని ఇబ్బంది పడుతున్న వాళ్లే. ఒకప్పటిలా వాళ్లు ఏం చేసినా చూసే పరిస్థితి లేదు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా వందల కోట్ల వసూళ్లు వచ్చి పడిపోవట్లేదు. రకరకాల అంశాలు కలిసి వచ్చి షారుఖ్ సినిమా ‘పఠాన్’ ఇరగాడేసింది కానీ.. మిగతా టాప్ స్టార్లందరికీ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయి.

ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ దెబ్బకు సినిమాలు మానేసి కూర్చున్నాడు. అక్షయ్ కుమార్ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఇక సల్మాన్ ఖాన్ సంగతి ఏమవుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కరోనా ప్రభావం మొదలయ్యాక సల్మాన్ ఖాన్ సినిమా ఏదీ కూడా థియేటర్లలో రిలీజ్ కాలేదు.

‘రాధే’ మూవీ ఓటీటీలో రిలీజై దారుణమైన టాక్ తెచ్చుకుంది. మరి మూడేళ్లకు పైగా గ్యాప్ తర్వాత వస్తున్న సల్మాన్ థియేట్రికల్ రిలీజ్ ‘కిసీ కీ భాయ్ కిసీ కా జాన్’ మీద అందరి దృష్టి నిలిచింది. ఐతే ఈ సినిమా ప్రోమోలు చూస్తేనే తేడాగా అనిపించగా.. థియేటర్లలో సినిమా చూసిన వాళ్లకు దిమ్మదిరిగింది.

మరీ రొడ్డకొట్టుడు స్టయిల్లో తీసిన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. సల్మాన్‌కు బేసిగ్గా ఉండే మాస్ ఫాలోయింగ్ వల్ల తొలి రోజు థియేటర్లలో కొంచెం సందడి కనిపించింది కానీ.. ఇది నిలబడే సినిమా కాదని తొలి రోజు వసూళ్లను చూస్తే అర్థమైపోతోంది. ఈ చిత్రానికి శుక్రవారం రూ.15 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి.

కరోనా తర్వాత వేరే పెద్ద హీరోల సినిమాలకు వచ్చిన వసూళ్లతో పోలిస్తే ఇది పర్వాలేదనిపించే నంబరే. కానీ సల్మాన్ స్థాయికి, కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ బడ్జెట్, బిజినెస్ కోణంలో చూస్తే మాత్రం చాలా తక్కువ. గత పదేళ్లలో మరే సల్మాన్ సినిమాకూ ఇంత తక్కువ వసూళ్లు రాలేదు. వీకెండ్ తర్వాత థియేటర్లు వెలవెలబోయేలా కనిపిస్తున్న సినిమాకు తొలి రోజు ఈ వసూళ్లంటే చాలా కష్టం అన్నట్లే. వీకెండ్ అయ్యేసరికి మహా అయితే 50-60 కోట్లు రావచ్చు.

ఫుల్ రన్లో వంద కోట్లు కూడా కష్టమే కావచ్చు. మేకర్స్ చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు. ఎంత నాన్-థియేట్రికల్ బిజినెస్ కలుపుకున్నా కూడా ఈ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టబోతున్నట్లే.

This post was last modified on April 23, 2023 7:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

8 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

8 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

9 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

9 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

10 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

11 hours ago