దర్శకుల్లో పూరీ జగన్నాథ్ కి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. కొన్నేళ్ళుగా పూరీ తీసిన సినిమాలు , హీరో పాత్రలు , డైలాగులు వింటూ ,చూస్తూ అతనికి ఫ్యాన్స్ అయిపోయారు సినీ జనాలు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ కి ముందు పూరీ తీసిన సినిమాలు చూసి అతని కం బ్యాక్ కోసం ఎదురుచూసిన మూవీ లవర్స్ చాలా మంది ఉన్నారు. అందరూ కోరుకున్నట్టే పూరీ ఇస్మార్ట్ తో ఐయామ్ బ్యాక్ అనిపించుకొని మళ్ళీ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.
ఆ తర్వాత విజయ్ తో ‘లైగర్’ తీసి ఎవరూ ఊహించని విధంగా ఇటు దర్శకుడిగా అటు నిర్మాతగా రెండు రకాలుగా నష్ట పోయాడు. దీంతో నెక్స్ట్ సినిమా ఎటూ కదలడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి పూరీ హైదరాబాద్ లో ఉన్నాడా ? లేదా ముంబై లో ఉన్నాడా ? అనేది ఎవరికీ తెలియడం లేదు. పూరీ ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాకి కూడా దూరమయ్యాడు. ఇక పూరీ నుండి పోడ్ కాస్ట్ వచ్చి కూడా నెల దాటేసింది. బహుశా రహస్యంగా ఎక్కడో తన పని తను చేసుకుంటున్నాడేమో.
పూరీ నెక్స్ట్ సినిమా చిరుతో అని కొందరు , బాలయ్యతో అని మరికొందరు అంటుంటే తాజాగా పూరీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తీసే ఆలోచనలో ఉన్నాడని గట్టిగా వినిపిస్తుంది. ఏదేమైనా లైగర్ దెబ్బకి పూరీ ఎక్కడా కనిపించకుండా మాయమైపోయాడు. మళ్ళీ పూరీ మీడియా ముందుకొచ్చేది కొత్త సినిమా ఓపెనింగ్ కే అనిపిస్తుంది.
This post was last modified on April 23, 2023 7:45 am
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…