వరుస చార్ట్ బాస్టర్స్ ఆల్బమ్స్ తో మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకున్న తమన్ ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. హీరో , దర్శకుడి తర్వాత సంగీత దర్శకుడి పై కూడా అంచనాలు నెలకొంటాయి. అతను ఇచ్చే మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉండాలని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. సదరు హీరో అభిమనులైతే సోషల్ మీడియాలో బెస్ట్ ఆల్బమ్ ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తుంటారు కూడా. అయితే ఇప్పుడు సరిగ్గా తమన్ ముందు అలాంటి ఛాలెంజులే ఉన్నాయి.
తమన్ మ్యూజిక్ చేస్తున్న క్రేజీ మూవీస్ లో ఒకటి గేమ్ ఛేంజర్ , మరొకటి ssmb28. ఈ రెండు సినిమాలకు సంబందించి ఇరు హీరోల అభిమానుల నుండి తమన్ కి గట్టి తాకిడి ఎదురవుతుంది. శంకర్ . రెహ్మాన్ ది అల్టిమేట్ కాంబో కానీ తొలిసారి శంకర్ తన పాన్ ఇండియా మూవీకి తమన్ చేతిలో పెట్టాడు. ఇక రెహ్మాన్ ను మించే ఆల్బమ్ ఇవ్వడం తమన్ ముందున్న పెద్ద టాస్క్. ఈ ఆల్బమ్ కోసం చరణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు.
ఇక తమన్ కి ఇంకో టాస్క్ మహేష్ సినిమా. అవును సర్కారు వారి పాట ఆల్బమ్ లో ఒక్క సాంగ్ మాత్రమే అదిరిపోయే రేంజ్ లో ఇచ్చాడు తమన్. మిగతా పాటలు ఫ్యాన్స్ కి అంతగా ఎక్కలేదు. దీంతో ఇప్పుడు మహేష్ -త్రివిక్రమ్ కాంబో సినిమాకు ది బెస్ట్ సాంగ్స్ ఉండాలని మహేష్ ఫ్యాన్స్ నుండి తమన్ కి హ్యూజ్ డిమాండ్. ఇక మహేష్ -త్రివిక్రమ్ -మనీశర్మ కాంబో లో వచ్చిన అతడు సాంగ్స్ ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపిస్తూ మళ్ళీ మళ్ళీ వినెళా ఉంటాయి. ఆ ఆల్బమ్ ను మించి మ్యూజిక్ ఇవ్వాలన్నది తమన్ ముందున్న పెద్ద ఛాలెంజ్. మరి ఇలా రెండు క్రేజీ బిగ్ ప్రాజెక్ట్స్ తో తమన్ ముందు పెద్ద ఛాలెంజులే ఉన్నాయి. వీటి సాంగ్స్ తో తమన్ ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి.
This post was last modified on April 24, 2023 6:10 am
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…