మార్చి లో రిలీజైన బలగం సినిమా యాబై రోజులు పూర్తి చేసుకొని సూపర్ డూపర్ హిట్ అనిపించుకుంది. తాజాగా సాయి ధరం తేజ్ నటించిన ‘విరూపాక్ష’ పాజిటిక్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. ఈ రెండు సినిమాల వెనుక ఓ సక్సెస్ ఫార్ములా ఉంది. అదే కాకి ఫార్ములా. అవును రెండు సినిమాళ్లో కాకి ముఖ్య భూమిక పోషించింది. బలగంలో అసలు కథే కాకి మీద ఉంటుంది. ఓ వ్యక్తి చనిపోయాక కాకి వచ్చి ఆ కుటుంబం పెట్టిన పదార్థాలు ముట్టకపోవడం అందులో మెయిన్ స్టోరీ.
ఇక విరూపాక్షలో కాకి ది మెయిన్ స్టోరీ కాదు కానీ , సినిమాలో కాకి ఓ కీ రోల్ లో కనిపించింది. క్షుద్ర పూజల కథతో మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విరూపాక్ష లో కాకి తోనే బ్లాక్ మేజిక్ చేస్తుంటారు. సినిమా ఆరంభం నుండి చివరి షాట్ వరకూ కాకి కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లో చాలా కాకులు వచ్చి అగ్నికి ఆహుతయ్యే షాట్ అయితే నెక్స్ట్ లెవెల్.
ఇలా సూపర్ హిట్ అనిపించుకున్న బలగంలో అలాగే విరూపాక్ష లో రెండిటిలో కాకి ఫార్ములా బాగా వర్కవుట్ అయింది. ఇక నెటిజన్లు కూడా కాకి ఎలిమెంట్స్ తో తెలుగులో వరుసగా రెండు హిట్లు కొట్టారని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా బలగం దర్శకుడు వేణుకి అలాగే విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఇద్దరికీ కాకి కలిసొచ్చినట్టే. ఇక ఇదే ఊపులో మరో కథలో ఏమైనా కాకి ను పెట్టి ఇంకో హిట్ కొడతారేమో చూడాలి.
This post was last modified on April 23, 2023 7:42 am
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…