Movie News

గోపీచంద్ ట్రైలర్.. ప్లస్సా మైనస్సా?

ఒక సినిమా మీద ప్రేక్షకులకు ఒక అంచనా రావడంలో అత్యంత కీలక పాత్ర ట్రైలర్‌దే. రిలీజ్ ముంగిట రిలీజ్ చేసే ఈ ప్రోమోను బట్టి సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అర్థం అయిపోతుంది. చాలా వరకు దర్శకులు మనం చూడబోయే సినిమా ఎలాంటిదో.. అందులో కథ ఎలా ఉండబోతోందో ట్రైలర్ ద్వారా హింట్ ఇస్తారు. సినిమాలోని హైలైట్లు ఏంటో కూడా అర్థం అయిపోతుంది ట్రైలర్ చూస్తే.

కొన్ని సినిమాలకు ట్రైలర్ల వల్లే మంచి హైప్ రావడం, ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం జరిగింది. అదే సమయంలో ట్రైలర్ బాగా లేకపోవడం వల్ల సినిమా మీద ఆసక్తి కోల్పోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలా రెండు రకాల ట్రైలర్లకూ ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఐతే పాజిటివ్ ట్రైలర్ వల్ల జరిగే మేలు కంటే.. బ్యాడ్ ట్రైలర్ వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. గోపీచంద్ కొత్త చిత్రం ‘రామబాణం’ ట్రైలర్ రెండో కోవకే చెందుతుందని చెప్పాలి.

ఇంతకుముందు లక్ష్యం, లౌక్యం లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన గోపీచంద్, శ్రీవాస్ కలయికలో తెరకెక్కిన ‘రామబాణం’ మీద మాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మిగతా ప్రేక్షకులను కూడా ఈ కాంబినేషన్ ఎగ్జైట్ చేసేదే. ‘లక్ష్యం’ అనేక ట్విస్టులతో, ఆసక్తికర కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘లౌక్యం’కు కామెడీ పెద్ద ఎసెట్ అయింది. కానీ ‘రామబాణం’ ఈ రెండు విషయాల్లోనూ నిరాశ పరిచేలా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే కామెడీకి స్కోపే కనిపించలేదు. ఇక ఈ సినిమాలో ట్విస్టులు, కొత్తదనం లాంటివి ఆశించడానికి వీల్లేదని ట్రైలర్ చూస్తే స్పష్టంగా తెలిసిపోయింది. ట్రైలర్లో ఎంత వెతికినా కొత్త అంశం ఏమీ కనిపించలేదు. డైలాగులు సహా అన్నీ ఒక ఔట్ డేటెడ్ ఫీల్‌తో సాగాయి.

గోపీచంద్ ఇలాంటి సినిమాలు ఎన్ని చేస్తాడు.. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు అనే ఫీలింగ్ కలిగింది ట్రైలర్ చూస్తే. మరి సినిమాలో ట్రైలర్‌ను మించి ఏమైనా సర్ప్రైజింగ్ అంశాలు ఏమైనా ఉంటాయేమో చూడాలి. మొత్తానికి ట్రైలర్ అయితే ‘రామబాణం’కు చాలా వరకు మైనస్సే అయిందని చెప్పాలి.

This post was last modified on April 23, 2023 7:35 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago