ఏదో డిఫరెంట్ గా ట్రై చేయాలని తపించే హీరో సుధీర్ బాబు. ఆ మధ్య హంట్ లో ఒక షాకింగ్ పాత్ర ద్వారా ప్రేక్షకులను థ్రిల్ చేద్దామనుకున్నాడు కానీ అది ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. అంతకు ముందు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలికీ ఇదే రిజల్ట్ వచ్చింది. అయినా సరే రూటు మారకుండా రెగ్యులర్ ఫార్ములాని టచ్ చేయకుండా మరో ఎక్స్ పరిమెంట్ కు సిద్ధమయ్యాడు. అదే మామా మశ్చీంద్ర. నటుడు కం దర్శకుడు హర్షవర్ధన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ట్రైలర్ ని మహేష్ బాబు ద్వారా విడుదల చేయించారు.
వీడియో నిమిషంన్నరలోపే ఉన్నప్పటికీ ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశాయి. మంచివాడిగా ఏడు జన్మలు ఎత్తడం కన్నా రాక్షసుడిగా మూడు సార్లు పుడితే చాలని నమ్మే ఒక వ్యక్తి(సుధీర్ బాబు)ని పోలిన మనుషులు మరో ఇద్దరు ఉంటారు. అందులో ఒకడు వయసైపోయిన పెద్దాయన కాగా ఒకడు స్థూలకాయంతో బాధపడే మనిషి ఇంకొకడు చలాకీగా జీవితం గడిపే యువకుడు. వీళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఏజ్డ్ గా కనిపించే ముసలాయన మిగిలిన వాళ్ళను ఎందుకు చంపాలనుకుంటున్నాడు లాంటి ట్విస్టులేవో గట్టిగానే సెట్ చేశారు.
మాయ చేసే మూడు పాత్రల్లో సుధీర్ బాబు బాగా కష్టపడినట్టు ఉంది. ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించిన మామా మశ్చీంద్రకు చైతన్ భరద్వాజ్ సంగీతంసమకూర్చారు. ట్రిపుల్ రోల్స్ పరంగా ఆ మధ్య కళ్యాణ్ రామ్ చేసిన అమిగోస్ ఛాయలు కొంత కనిపించినప్పటికీ హర్షవర్ధన్ ట్రీట్ మెంట్ పూర్తిగా వేరేలా ఉంది. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు చేయలేదు కానీ ఈ వేసవిలోనే మంచి పోటీ లేని టైం చూసి థియేటర్లలో వదిలేందుకు రెడీ అవుతున్నారు. ఈసారైనా సుధీర్ బాబు కోరుకున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఈ మశ్చీంద్ర అందిస్తాడో లేదో త్వరలోనే తేలనుంది
This post was last modified on April 22, 2023 11:17 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…